లైసెన్సు, పర్మిట్లు జూన్ 30వరకు చెల్లుబాటు!

వాహనదారులకు ఉపశమనం కలిగించే విషయాన్ని కేంద్ర రోడ్డు, రవాణా మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 1వ తేదీ నుంచి కాలం ముగిసిపోయే అన్ని వాహనాల పర్మిట్లు, ఫిట్‌నెస్‌, డ్రైవింగ్‌ లైసెన్సులతోపాటు ఇతర డాకుమెంట్లు జూన్‌ 30వరకు చెల్లుబాటు అవుతాయని ప్రకటించింది.

Published : 31 Mar 2020 14:31 IST

దిల్లీ: వాహనదారులకు ఉపశమనం కలిగించే విషయాన్ని కేంద్ర రోడ్డు, రవాణా మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 1వ తేదీ నుంచి కాలం ముగిసిపోయే అన్ని వాహనాల పర్మిట్లు, ఫిట్‌నెస్‌, డ్రైవింగ్‌ లైసెన్సులతోపాటు ఇతర డాకుమెంట్లు జూన్‌ 30వరకూ చెల్లుబాటు అవుతాయని ప్రకటించింది. దీంతో ఇప్పటికే గడువు ముగిసిన డ్రైవింగ్‌ లైసెన్సులు, వాహన రిజిస్ట్రేషన్‌తో పాటు మోటార్‌ వాహన చట్టం కింద వచ్చే అన్ని పత్రాలు జూన్‌ 30వరకు చెల్లుబాటు అవుతాయి. దేశవ్యాప్తంగా 21రోజులపాటు లాక్‌డౌన్‌ విధించడంతో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు మూతపడ్డ విషయం తెలిసిందే. ఈ సమయంలో వాహనాలకు సంబంధించిన డాక్యుమెంట్ల గడువు పొడగించుకునే అవకాశం లేదు. దీంతో సరుకు రవాణాతోపాటు వివిధ అత్యవసర సేవల వాహనాలకు అంతరాయం కలగకుండా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. అన్ని రకాల వాహనదారులకు ఇది వర్తిస్తుంది. వాహనదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అన్ని రాష్ట్రాలు పాటించాలని రాష్ట్రాలకు సూచించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని