కరోనా చికిత్సకు మందుల కొరత లేదు: కేంద్రం

కొవిడ్‌-19 చికిత్సకు అవసరమైన ఔషధాల కొరత లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అంతరాయం లేకుండా మందుల సరఫరాకు ఇతర శాఖలతో కలిసి ఫార్మాస్యూటికల్స్‌ శాఖ (డీఓపీ) పర్యవేక్షిస్తోందని వెల్లడించింది. చైనాలోని వుహాన్‌లో ఈ మహమ్మారి వైరస్‌ బయట....

Published : 31 Mar 2020 23:09 IST

ముంబయి: కొవిడ్‌-19 చికిత్సకు అవసరమైన ఔషధాల కొరత లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అంతరాయం లేకుండా మందుల సరఫరాకు ఇతర శాఖలతో కలిసి ఫార్మాస్యూటికల్స్‌ శాఖ (డీఓపీ) పర్యవేక్షిస్తోందని వెల్లడించింది. చైనాలోని వుహాన్‌లో ఈ మహమ్మారి వైరస్‌ బయటపడ్డప్పట్నుంచే సంబంధిత మందులకు డీఓపీ తొలి ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొంది.

ఏ సమయంలోనైనా సరే నిత్యావసరమైన మందుల నిల్వలను ఉత్పత్తి చేసేందుకు సిద్ధంగా ఉండాలని జాతీయ ఫార్మాస్యూటికల్స్‌ ధరల నియంత్రణ సంస్థ (ఎన్‌పీపీఏ) తయారీదారులను ఆదేశించింది. లాక్‌డౌన్‌ సమయంలో సంస్థలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకున్నామని వెల్లడించింది.

‘మందులు, వైద్య పరికరాల ఉత్పత్తి కోసం వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, పరిశ్రమల, కస్టమ్స్‌, కేంద్ర రాష్ట్ర డ్రగ్‌ నియంత్రణదారులు, రాష్ట్ర ప్రభుత్వాలతో ఫార్మాస్యూటికల్స్‌ శాఖ సమన్వయంతో పనిచేస్తోంది’ అని కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలియజేసింది. డీఓపీలో ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూమ్‌ (011-23389840) రోజూ ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పనిచేస్తుందని పేర్కొంది. ఎన్‌పీపీఏ ఏర్పాటు చేసిన మరో కంట్రోల్‌ రూమ్‌ (1800-111255)ను 24 గంటలు పనిచేస్తుందని వెల్లడించింది. ఔషధాల ఉత్పత్తి, సరఫరా, ముడిసరుకు, రవాణా సంబంధిత ఫిర్యాదులు చేయొచ్చని తెలిపింది.

చదవండి: చైనా.. అంతమంది చనిపోతే అబద్ధాలు చెబుతావా?

చదవండి: వలస కూలీలతో గ్రామాలకు వైరస్‌!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని