ప్రధాని మోదీకి ఇవాంక ధన్యవాదాలు

ప్రధాని మోదీకి యోగా అంటే ఎంతో ఇష్టమనే విషయం అందరికీ తెలిసిందే. అంతేకాకుండా ప్రజలంతా కూడా యోగా సాధన చేయాలని ఆయన కోరుతుంటారు. ఇటీవల మన్‌కీ బాత్‌లో మాట్లాడుతూ కరోనా

Published : 01 Apr 2020 00:59 IST

దిల్లీ: ప్రధాని మోదీకి యోగా అంటే ఎంతో ఇష్టమనే విషయం అందరికీ తెలిసిందే. అంతేకాకుండా ప్రజలంతా కూడా యోగా సాధన చేయాలని ఆయన కోరుతుంటారు. ఇటీవల మన్‌కీ బాత్‌లో మాట్లాడుతూ కరోనా కట్టడికి విధించిన 21 రోజుల లాక్‌డౌన్‌ కాలంలో ధృడంగా ఉండేందుకు యోగా సాధన చేయాలని, దానికి సంబంధించిన వీడియోలను సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేస్తానని తెలిపారు. ఈ మేరకు ప్రధాని షేర్‌ చేసిన యోగా వీడియోకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కుమార్తె ఇవాంక ట్రంప్‌ ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం ప్రధాని నిద్ర యోగాసనానికి సంబంధించిన వీడియోని తన ట్విట్వర్‌ ఖాతాలో షేర్‌ చేశారు. ‘‘నాకు ఎప్పుడు సమయం దొరికినా, వారానికి ఒకటి లేదా రెండు సార్లు యోగా నిద్ర ఆసనం సాధన చేస్తాను. ఇది మనస్సుకు ప్రశాంతతను ఇస్తుంది. ఒత్తిడిని, ఆందోళనను తగ్గిస్తుంది. ఆంగ్లం, హిందీలో ఉన్న ఈ ఆసనానికి సంబంధించిన వీడియో లింకులను కింద షేర్ చేస్తున్నాను’’ అని ట్వీట్‌ చేశారు. ఈ వీడియో చూసిన  ఇవాంక, ‘‘ఇది ఎంతో అద్భుతం, ధన్యవాదాలు’’ అని ప్రధాని యోగా వీడియోని ఉద్దేశించి ట్వీట్ చేశారు. ట్రంప్ భారత పర్యటన సందర్భంగా ఆయనతో కలిసి ఇవాంక భారత్‌లో పర్యటించారు. 

ఇక ప్రధాని మోదీ దేశంలో కరోనా వ్యాప్తిని నివారించేందుకు భారత్‌ దేశం మొత్తం మార్చి 24 నుంచి 21 రోజుల పాటు లాక్‌డౌన్‌ విధించారు. అంతే కాకుండా కరోనా పోరులో భాగంగా ఈ వైరస్‌ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించకుండా ప్రజలంతా సామాజిక దూరం పాటించాలని ప్రధాని కోరారు.  ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 1397 మందికి కరోనా సోకింది. వీరిలో 124 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. మృతిచెందిన వారి సంఖ్య 35కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్ బారిన పడ్డవారి సంఖ్య 1,63,000కి చేరింది. వైరస్‌ కారణంగా మరణించిన వారి సంఖ్య 3017కి చేరింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని