లాక్‌డౌన్‌: మోదీజీ, మీరు మూడింతల భేష్

ఆంక్షలతో సరిపెట్టకుండా పేదప్రజలు ఏ విధమైన ఇబ్బందులకు గురికాకూడదని చిత్తశుద్ధితో కృషి చేస్తున్నందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యక్షుడు మోదీని ప్రశంసించారు.

Published : 02 Apr 2020 19:50 IST

ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యక్షుడి కితాబు

దిల్లీ: కరోనా వైరస్‌ లాక్‌డౌన్‌ నేపథ్యంలో దేశంలోని పేదలకు సహాయం చేసే దిశగా భారత ప్రధాని నరేంద్ర మోదీ కృషిని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యక్షుడు టెడ్రోస్‌ అథనోమ్‌ ప్రశంసించారు. మూసివేత సమయంలో సమాజంలో అట్టడుగు వర్గాల వారు కఠిన పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. కరోనాను నిరోధించటానికి ప్రజలు ఇంటికే పరిమితమవ్వాలని ప్రభుత్వాలు నిర్బంధిస్తున్నాయని... కానీ, పేద ప్రజలు ఇబ్బందుల పట్ల అవి అలసత్వం వహిస్తున్నాయని ఆయన తెలిపారు. ఆంక్షలతో సరిపెట్టకుండా పేదప్రజలు ఏ విధమైన ఇబ్బందులకు గురికాకూడదని చిత్తశుద్ధితో కృషి చేస్తున్నందుకు ఆయన మోదీని ప్రశంసిస్తూ ఓ ట్విటర్‌ ప్రకటన విడుదల చేశారు. 

‘‘భారత్‌లోని కొవిడ్‌-19 కల్లోలం సందర్భంగా ప్రభావితమయ్యే ప్రజలకు మేలు కలిగే విధంగా 800 మిలియన్ల (80 కోట్లు) నిస్సహాయ ప్రజలకు ఆహార సరఫరా, 204 (20కోట్ల 40 లక్షలు) మిలియన్ల పేద మహిళలకు ఆర్థిక సహాయం,  80 మిలియన్ల (8 కోట్ల) కుటుంబాలకు ఉచిత వంటగ్యాస్ వంటి అంశాలతో కూడిన 24 బిలియన్‌ డాలర్ల సహకారాన్ని ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీకి నా ప్రశంసలు.‌’’ అని తెలిపారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఈ స్థాయిలో సమాజహిత కార్యక్రమాలు చేపట్టటం అందరికీ సాధ్యం కాదని ఆయన అన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని