మర్కజ్‌ వెళ్లిన వారందరికీ పరీక్షలు: కేజ్రీవాల్‌

దేశ రాజధానిలో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య రానున్న రోజుల్లో మరిన్ని పెరుగుతాయని దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ అన్నారు. అందుకే మర్కజ్‌ వెళ్లిన వారందరికీ పరీక్షలు....

Published : 02 Apr 2020 21:24 IST

దిల్లీ: దేశ రాజధానిలో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య రానున్న రోజుల్లో మరిన్ని పెరిగే అవకాశం ఉందని దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ అన్నారు. అందుకే నిజాముద్దీన్‌ మర్కజ్‌ వెళ్లొచ్చిన వారందరికీ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. మర్కజ్‌ నుంచి వచ్చిన వాళ్లలో ఇద్దరు మరణించినట్లు తెలిపారు. దీంతో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య నాలుగుకు చేరిందని గురువారం నిర్వహించిన డిజిటల్‌ ప్రెస్‌మీట్‌లో ఆయన వివరాలు వెల్లడించారు.

మర్కజ్‌ నుంచి మొత్తం 2,346 మందిని ఖాళీ చేయించగా.. అందులో 108 మందికి కరోనా పాజిటివ్‌ తేలినట్లు కేజ్రీవాల్‌ వెల్లడించారు. ఈ నేపథ్యంలో కరోనా కేసులు రానున్న రోజుల్లో పెరగనున్నాయని, మర్కజ్‌కు వెళ్లొచ్చిన వారందరికీ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్లు చెప్పారు. దిల్లీలో 208 పాజిటివ్‌ కేసులు ఉన్నాయని,  ఆరుగురు డిశ్చార్జి అవ్వగా.. మిగిలిన వారు చికిత్స పొందుతున్నారని తెలిపారు. వారి ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. మర్కజ్‌ వెళ్లి వచ్చిన 1810 మందితో పాటు మొత్తం 2,943 మంది క్వారంటైన్లో ఉన్నారని తెలిపారు. మరో 21 వేల మంది సెల్ఫ్‌ క్వారంటైన్‌లో ఉన్నారని చెప్పారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఆటో రిక్షా, గ్రామీణ్‌ సేవా, ఈ-రిక్షా డ్రైవర్లకు రూ.5వేలు ఆర్థిక సాయం ఇవ్వనున్నట్లు కేజ్రీవాల్‌ ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని