కరోనా: 30వేల మంది వైద్యులు స్వచ్ఛందంగా..

కొవిడ్‌-19పై యుద్ధభేరీ మోగించేందుకు 30వేలకు పైగా విశ్రాంత ప్రభుత్వ వైద్యులు, వైద్య సిబ్బంది, సైనిక వైద్య సేవకులు, ప్రైవేటు వైద్యులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారని ప్రభుత్వం తెలిపింది. కరోనాపై పోరాడేందుకు స్వచ్ఛందంగా పేర్లు నమోదు చేసుకోవాలని మార్చి 25న ప్రభుత్వం కోరిన సంగతి తెలిసిందే.....

Published : 03 Apr 2020 18:17 IST

దిల్లీ: కొవిడ్‌-19పై యుద్ధభేరీ మోగించేందుకు 30వేలకు పైగా విశ్రాంత ప్రభుత్వ వైద్యులు, వైద్య సిబ్బంది, సైనిక వైద్య సేవకులు, ప్రైవేటు వైద్యులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారని ప్రభుత్వం తెలిపింది. కరోనాపై పోరాడేందుకు స్వచ్ఛందంగా పేర్లు నమోదు చేసుకోవాలని మార్చి 25న ప్రభుత్వం కోరిన సంగతి తెలిసిందే.

‘కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు 30,100 వైద్యసిబ్బంది స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. ఇందులో విశ్రాంతి ప్రభుత్వ వైద్యులు, సైనిక వైద్య సేవకులు, ప్రైవేటు వైద్యులు ఉన్నారు’ అని ప్రభుత్వ సీనియర్‌ అధికారి ఒకరు మీడియాకు వెల్లడించారు. వైద్యశాఖ ప్రకారం ప్రస్తుతం దేశంలో కొవిడ్‌-19 కేసులు 2,301కి చేరుకున్నాయి. 56 మంది మృతిచెందారు. చైనాలో వెలుగుచూసి ప్రపంచమంతా సంక్రమించిన నావెల్‌ కరోనా వైరస్‌పై పోరాడేందుకు స్వచ్ఛందంగా పేర్లు నమోదు చేసుకోవాలని నీతిఆయోగ్‌ వెబ్‌సైట్లో మార్చి 25న ప్రభుత్వం ప్రకటన వెలువరించింది. కరోనా కట్టడికి అమెరికా, ఇటలీ, బ్రిటన్‌, వియత్నాం సహా అనేక దేశాల్లో విశ్రాంత వైద్యులు, వైద్య సిబ్బంది ముందుకు రావాలని పిలుపునిచ్చాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని