ఉపగ్రహానికి ‘వుహాన్’ పేరు పెట్టిన చైనా

కరోనా వైరస్‌ ఉపద్రం నుంచి గట్టెక్కిన చైనా ఈ నెలలో రెండు ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించనుంది. రోదసి ఆధారిత ‘ఇంటర్నెట్‌ ఆఫ్ థింగ్స్‌’ (ఐవోటీ) ప్రాజెక్ట్‌ కోసం వీటిని ప్రయోగిస్తున్నారు. ఇందులో ఒక ఉపగ్రహానికి ‘వుహాన్‌’గా నామకరణం చేయడం గమనార్హం....

Published : 04 Apr 2020 00:33 IST

బీజింగ్‌: కరోనా వైరస్‌ ఉపద్రవం నుంచి గట్టెక్కిన చైనా ఈ నెలలో రెండు ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించనుంది. రోదసి ఆధారిత ‘ఇంటర్నెట్‌ ఆఫ్ థింగ్స్‌’ (ఐవోటీ) ప్రాజెక్ట్‌ కోసం వీటిని ప్రయోగిస్తున్నారు. ఇందులో ఒక ఉపగ్రహానికి ‘వుహాన్‌’గా నామకరణం చేయడం గమనార్హం.

కొవిడ్‌-19 మహమ్మారి తొలిసారి చైనాలోని వుహాన్‌లోనే వెలుగుచూసింది. అక్కడి సముద్ర ఆహార మార్కెట్లో పుట్టిన ఈ వైరస్‌ నేటికి పది లక్షల మందికి సోకింది. అయితే ఈ నగరంలోనే చైనా అంతరిక్ష పరిశోధన సంస్థ (సీఏఎస్‌ఐసీ)కి చెందిన సంజియాంగ్‌ సంస్థ ఉంది. వైరస్‌ భయం ఉన్నప్పటికీ ఇక్కడి సిబ్బంది శ్రమించి ఉపగ్రహాన్ని రూపొందించారు. అందుకే దానికి ‘వుహాన్‌’ అని పేరు పెట్టారని అక్కడి అధికార వార్తా సంస్థ షిన్హువా తెలిపింది.

క్వాయిజౌ-1ఏ అనే రాకెట్‌ ఈ రెండు ఉపగ్రహాలను అంతరిక్షంలో ప్రవేశపెట్టనుంది. జింగ్‌యున్‌ ఇంజినీరింగ్‌ ప్రాజెక్టులో భాగంగా భూమికి దిగువ కక్ష్యలో ప్రవేశపెట్టే మొత్తం 80 ఉపగ్రహాల్లో ఇవి మొదటివి. సముద్రాలు, అడవులు, ఇంజినీరింగ్‌ యంత్రాల కమ్యూనికేషన్ల కోసం వీటిని తయారు చేశారని తెలిసింది. గురువారం నాటికి చైనాలో 81,620 కొవిడ్‌-19 కేసులు నమోదు కాగా 3,322 మంది మృతిచెందారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని