కళకు సృజన అద్దిన ఉక్రెయిన్‌ మహిళలు 

తమ దేశ సంప్రదాయ కళకు సృజనాత్మకతను జోడించి అత్యవసర సమయంలో చేయూతనిస్తూ ఉక్రెయిన్‌ మహిళలు ఆకట్టుకుంటున్నారు.  మాస్కులకు తీవ్ర డిమాండ్‌ పెరిగిన నేపథ్యంలో వినూత్న రీతిలో వీటిని రూపొందిస్తూ కొవిడ్‌-19పై పోరాటం చేస్తున్న వైద్యసిబ్బందికి ఉచితంగా అందజేస్తున్నారు.

Published : 04 Apr 2020 22:03 IST

వినూత్న రీతిలో మాస్కుల తయారీ

వైద్య సిబ్బందికి ఉచితంగా అందజేత


 

ఉక్రెయిన్‌: తమ దేశ సంప్రదాయ కళకు సృజనాత్మకతను జోడించి అత్యవసర సమయంలో చేయూతనిస్తూ ఉక్రెయిన్‌ మహిళలు ఆకట్టుకుంటున్నారు.  మాస్కులకు తీవ్ర డిమాండ్‌ పెరిగిన నేపథ్యంలో వినూత్న రీతిలో వీటిని రూపొందిస్తూ కొవిడ్‌-19పై పోరాటం చేస్తున్న వైద్యసిబ్బందికి ఉచితంగా అందజేస్తున్నారు. సంప్రదాయ కుట్లు, అల్లికలకు  ఉక్రెయిన్‌ ప్రసిద్ధి. అల్లిక కళ ఆ దేశ సంస్కృతిలో అంతర్భాగం. ఇక్కడ ఎంబ్రాయిడరీ కళకు ఘన చరిత్ర ఉంది.  ఇప్పడు ఈ  కళకు కొంత సృజనాత్మకతను జోడించి హోయరా అనే ఫ్యాషన్‌ డిజైనింగ్‌ సంస్థ మాస్కులు తయారు చేస్తోంది.  కరోనాపై యద్ధంలో తొలి వరుసలో ఉండి పోరాడుతున్న వైద్య, ఆరోగ్య సిబ్బందికి ఉచితంగా మాస్కులు అందించాలనే సదుద్దేశంతో తమ సంస్థ ముందుకెళ్తున్నట్లు హోయరా యజమాని ఇరీనా క్రిస్టినిచ్‌ తెలిపారు. సాధారణ మాస్కులకు భిన్నంగా వివిధ రకాలుగా ఉపయోగించేందుకు వీలుగా పరిశుభ్రతా నియమాలు పాటించి తయారు చేస్తున్నట్లు తెలిపారు. 
పునర్వినియోగం.. 
సంప్రదాయ అల్లికలను జోడించి మూడు పొరలతో ఈ మాస్కులను తయారు చేస్తున్నారు.  సాధారణంగా ఫార్మసీ మాస్కులను రెండు గంటలకోసారి మార్చాల్సి ఉంటుంది.  కానీ వీరు తయారు చేస్తున్న మాస్కులను పునర్వినియోగించుకోవచ్చు. కొద్ది గంటలు వాడిన తరువాత వేడి నీటిలో శుభ్రపరిచి ఇస్త్ర్రీ చేస్తే వైద్య చికిత్సలో ఉపయోగించుకోవచ్చని అక్కడి వైద్యులు చెబుతున్నారు. అందమైన ఎంబ్రాయిడరీతో తయారు చేసిన ఈ మాస్కులను చూడగానే మనుసులో సానుకూల దృక్ఫథం ఏర్పడి రోగనిరోధక శక్తి పెరుగుతుందంటున్నారు. 
11 మంది మహిళలు.. 
హోయరా ఫ్యాషన్ స్టూడియోలో 11 మంది మహిళలు పని చేస్తున్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో కొందరు రాలేకపోవడంతో ప్రస్తుతం నలుగురు మాత్రమే పని చేస్తూ రోజుకు 50 మాస్కులు తయారు చేస్తున్నట్లు తెలిపారు. 

 

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని