Published : 04 Apr 2020 21:08 IST

వధూవరులు వీళ్లు.. అతిథులు వారు..!

కాబోయే భార్య కోసం..

వాషింగ్టన్‌: అమెరికాలో జరగబోతున్న ఓ పెళ్లిలో కార్డ్‌బోర్డ్‌ కటౌట్లు అతిథుగా మారబోతున్నాయి. కరోనా వైరస్‌ ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న నేపథ్యంలో ఎక్కువ మంది ఒక్కచోటు చేరకుండా లాక్‌డౌన్‌ విధించిన సంగతి తెలిసిందే. దీంతో తనకు కాబోయే భార్య కోసం ఓ యువకుడు వినూత్నంగా ఆలోచించాడు. త్వరలో జరగబోతున్న తమ పెళ్లికి మనుషుల ఆకారాల్లో కటౌట్లు చేయించి, చర్చిలో ఉంచబోతున్నాడు. డాన్ స్టగ్లిక్, అమీ సిమోన్సన్‌ల వివాహం త్వరలో జరగబోతోంది. అయితే పెళ్లి ఏర్పాట్లకు కరోనా వైరస్‌ అడ్డుపడింది. లాక్‌డౌన్‌ కారణంగా కుటుంబ సభ్యులు, బంధువులు వీరి వివాహానికి హాజరు కాలేకపోతున్నారు.

దీంతో కొలొమాలోని మెనాషా ప్యాకేజింగ్ కంపెనీ 100 కార్డ్‌బోర్డ్‌ కటౌట్లను కాబోయే వధూవరులకు విరాళంగా ఇచ్చింది. స్త్రీ, పురుషులు, చిన్నారులు.. ఇలా అందరూ కూర్చొని పోజు ఇస్తున్నట్లు వాటిని రూపొందించింది. ‘డాన్‌ స్టగ్లిక్‌ సాధారణ వ్యక్తి ఆకారంలో కటౌట్లు చేయమని చెప్పాడు. కానీ మేం దాన్ని ఇంకా సహజంగా ఉంచేందుకు పొడవు వ్యక్తులు, పొట్టివారు, చిన్నారులు.. ఇలా వివిధ రకాలుగా తయారు చేశాం’ అని కంపెనీ డిజైన్‌ మేనేజర్‌ పేర్కొన్నాడు. కొలొమా టౌన్‌షిప్‌ పోలీసు అధికారి మాట్లాడుతూ.. ‘తన వివాహాన్ని ప్రత్యేకంగా మార్చుతున్న కంపెనీకి డాన్ స్టగ్లిక్ ధన్యవాదాలు చెప్పుకోవాలి’ అని అన్నాడు.

‘నాకు కాబోయే భార్య ఖాళీ చర్చిలో పెళ్లి కుమార్తెగా నడుస్తూ రావడం నాకు ఇష్టం లేదు. అందుకే కొత్తగా ఏదైనా చేయాలి అనుకున్నా. నిజంగా ఇది నన్ను ఎంతో బాధిస్తోంది. కానీ మెనాషా మా పెళ్లికి కాస్త సందడిని చేకూర్చింది’ అని ఈ సందర్భంగా డాన్‌ స్టగ్లిన్‌ చెప్పాడు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని