వీళ్లను చావు కూడా వేరు చేయలేకపోయింది..!

చావు కూడా ఈ జంటను వేరు చేయలేకపోయింది. 51 ఏళ్ల వైవాహిక జీవితంలో కష్టసుఖాల్ని పంచుకున్నారు. ఒకర్ని విడిచి మరొకరు ఉండలేనంతగా అనురాగాన్ని నింపుకున్నారు. చివరికి ఒకేసారి ఈ లోకాన్ని విడిచారు. ఫ్లోరిడాకు చెందిన దంపతుల కథ ఇది. స్టువర్ట్ బేకర్ (74), అడ్రియన్ బేకర్.....

Published : 06 Apr 2020 01:30 IST

ఫ్లోరిడా: చావు కూడా ఈ జంటను వేరు చేయలేకపోయింది. 51 ఏళ్ల వైవాహిక జీవితంలో కష్టసుఖాల్ని పంచుకున్నారు. ఒకర్ని విడిచి మరొకరు ఉండలేనంతగా అనురాగాన్ని నింపుకున్నారు. చివరికి ఒకేసారి ఈ లోకాన్ని విడిచారు. ఫ్లోరిడాకు చెందిన దంపతుల కథ ఇది. స్టువర్ట్ బేకర్ (74), అడ్రియన్ బేకర్ (72) 51 ఏళ్ల క్రితం వివాహ బంధంతో ఒక్కటయ్యారు. కరోనా వైరస్‌తో బాధపడుతూ ఇద్దరు గత వారం మృతి చెందారు. ఆరు నిమిషాల తేడాతో ఇద్దరు మరణించారు. అయితే చావు కూడా తన తల్లిదండ్రుల్ని వేరు చేయలేకపోయిందని వారి కుమారుడు బడ్డీ బేకర్‌ అన్నాడు.

‘మార్చి నెల మధ్యలో నా తల్లిదండ్రులు అనారోగ్యానికి గురయ్యారు. దీంతో స్వీయ నిర్బంధంలో ఉన్నారు. కొన్ని రోజుల క్రితం మా నాన్న ఆరోగ్యం క్షీణించింది. దీంతో ఆసుపత్రికి తరలించాం. మా అమ్మకు కనీసం జ్వరం కూడా లేదు. అందుకే ఆమెను చికిత్సకు తీసుకెళ్లలేదు. నాన్న పరిస్థితి నిలకడగా ఉందన్నారు. కానీ ఓరోజు ఆసుపత్రి నుంచి ఫోన్‌ వచ్చింది. మీ నాన్నకు కరోనా పాజిటివ్‌ రిపోర్ట్‌ వచ్చిందని చెప్పారు. నాన్న వైరస్‌ను తట్టుకునేలా లేరని వైద్యులు తెలిపారు. మా అమ్మకు విషయం చెప్పి బాధపెట్టడం ఇష్టం లేక జాగ్రత్తలు పాటించి.. ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లాం. అమ్మను పరీక్షించిన వైద్యులు ఆమెకు శ్వాస సరిగా ఆడటం లేదని, కరోనా ఉందని నిర్ధారించారు. ఆపై అమ్మానాన్నల ఆర్గాన్‌లు ఫైయిల్‌ కావడంతో మరో ఆసుపత్రికి తరలించాం. అక్కడ ఇద్దరినీ ఒకే గదిలో ఉంచారు. అక్కడే అమ్మానాన్న కన్నుమూశారు. ఈ ఘటనను ప్రజలు తీవ్రంగా తీసుకోవాలి. అందరూ సామాజిక దూరాన్ని పాటించాలి. తరచూ చేతులు కడుక్కుంటూ.. ఇంట్లోనే ఉండాలి’ అని బడ్డీ బేకర్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

 


Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts