USలో కరోనాతో నలుగురు భారతీయులు మృతి

అమెరికాలో కొవిడ్‌-19తో నలుగురు భారతీయులు మృతిచెందారని మలయాళ సంఘం తెలిపింది. కరోనా వైరస్‌తో అలెయమ్మ కురియకోస్‌ (65), తనకచన్‌ ఎంచెనట్టు (51), అబ్రహం శామ్యూల్‌ (45), ష్వాన్‌ అబ్రహం (21) న్యూయార్క్‌లో మరణించారని ఉత్తర అమెరికా కేరళ సమాఖ్య (ఎఫ్‌ఓకేఎన్‌ఏ)...

Updated : 06 Apr 2020 19:59 IST

న్యూయార్క్‌: అమెరికాలో కొవిడ్‌-19తో నలుగురు భారతీయులు మృతిచెందారని మలయాళ సంఘం తెలిపింది. కరోనా వైరస్‌తో అలెయమ్మ కురియకోస్‌ (65), తనకచన్‌ ఎంచెనట్టు (51), అబ్రహం శామ్యూల్‌ (45), ష్వాన్‌ అబ్రహం (21) న్యూయార్క్‌లో మరణించారని ఉత్తర అమెరికా కేరళ సమాఖ్య (ఎఫ్‌ఓకేఎన్‌ఏ) వెల్లడించింది.

ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు సమాఖ్య తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. వ్యాధి సోకిన వారి కుటుంబాలతో నిరంతరం మాట్లాడుతున్నామని న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్‌ జనరల్‌ వెల్లడించింది. ప్రస్తుతం అమెరికాలో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. అమెరికాలో 1,13,000 మందికి పైగా కొవిడ్‌ సోకింది. కరోనా ప్రజ్వలన కేంద్రమైన న్యూయార్క్‌లోనే 63,000 పైగా బాధితులు ఉన్నారు. ఆ నగరంలోనే ఇప్పటి వరకు 2,620 మందికి పైగా మృతిచెందారు. రోజు రోజుకూ మరణాల సంఖ్య పెరుగుతుండటం కలవరపెడుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని