వైద్యుల పట్ల కృతజ్ఞతతో మెలగాలి: మోదీ

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు  వైద్యులు, ఆరోగ్య సిబ్బందికి శుభాకాంక్షలు...

Updated : 07 Apr 2020 13:30 IST

దిల్లీ: ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు  వైద్యులు, ఆరోగ్య సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘కరోనాపై పోరాడుతున్న వారికి కృతజ్ఞత చూపించే అవకాశం లభించింది. దేశంలో ప్రతి ఒక్కరూ వారి ఆరోగ్యాలు బాగుండాలని ప్రార్థించాలి. వైద్యులు, ఆరోగ్య సిబ్బంది పట్ల కృతజ్ఞతతో మెలగాలి. భౌతికదూరం వల్ల మనతో పాటు ఇతరుల ప్రాణాలను కాపాడుకోగలం’’ అని మోదీ ట్వీటర్‌లో పేర్కొన్నారు.

వైద్యులు, నర్సుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే చర్యలు తీసుకోవాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. సేవలందిస్తున్న వైద్య సమాజాన్ని గౌరవించాలని కోరారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు