కరోనా లేదు..లాక్‌డౌన్‌ ఎత్తేస్తాం

కరోనా వైరస్‌ కారణంగా భారత్‌లోని చాలా రాష్ట్రాలు ఆందోళనకర పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి.

Published : 07 Apr 2020 18:18 IST

అధికారిక ప్రకటన చేసిన మేఘాలయ 


షిల్లాంగ్: కరోనా వైరస్‌ కారణంగా భారత్‌లోని చాలా రాష్ట్రాలు ఆందోళనకర పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. కొన్ని రాష్ట్రాలు అయితే లాక్‌డౌన్‌ను పొడిగించాలంటూ కేంద్రాన్ని విజ్ఞప్తి కూడా చేశాయి. అయితే ఈశాన్య భారతంలోని మేఘాలయ మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరించింది. లాక్‌డౌన్‌ను పాక్షికంగా ఎత్తివేయాలని నిర్ణయించుకుంది. దీనిపై అక్కడి ప్రభుత్వం అధికారిక ప్రకటన కూడా చేసింది. అందుకు కారణం అక్కడ ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాకపోవడమే. 

‘ఏప్రిల్ 15 నుంచి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు పనిచేస్తాయి. పాఠశాలలను మాత్రం ఏప్రిల్ 30 వరకు మూసి ఉంచుతాం. ఆరోగ్య శాఖ చేసిన సూచనలను అనుసరించి గ్రామీణ ప్రాంతాల్లోని మార్కెట్లు తెరవడానికి, రైతులు పొలాలకు వెళ్లడానికి అనుమతిస్తాం’ అని ఆ ప్రకటనలో ప్రభుత్వం పేర్కొంది. అయితే ప్రయివేటు సంస్థలు మాత్రం మరికొంత కాలం మూసే ఉంటాయని తెలిపింది.
కొవిడ్ ఉద్ధృతికి అడ్డుకట్ట వేయడానికి కేంద్రం గత నెల 25 నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను విధించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు భారత్ వ్యాప్తంగా 4421 మందికి కరోనా వైరస్‌ సోకగా, 114 మంది మరణించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని