జర్నలిస్ట్‌ మృతికి ప్రధాని సంతాపం!

కరోనా మహమ్మారి బారినపడి ప్రముఖ జర్నలిస్ట్‌ కంచిభొట్ల బ్రహ్మానందం మృతిచెందడం పట్ల ప్రధానమంత్రి నరేంద్రమోదీ సంతాపం వ్యక్తం చేశారు.

Updated : 08 Apr 2020 12:42 IST

దిల్లీ: కరోనా మహమ్మారి బారినపడి ప్రముఖ జర్నలిస్ట్‌ కంచిభొట్ల బ్రహ్మానందం మృతిచెందడం పట్ల ప్రధానమంత్రి నరేంద్రమోదీ సంతాపం వ్యక్తం చేశారు. కొవిడ్‌ కారణంగా బ్రహ్మానందం మరణించడం ఎంతో కలచివేసిందని ప్రధాని ట్విటర్‌లో పేర్కొన్నారు. జర్నలిజంలో కంచిభొట్ల చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.  

కంచిభొట్ల బ్రహ్మానందం ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా పర్చూరు వాసి. రాష్ట్రంలో ఓ ఆంగ్లపత్రిక పాత్రికేయునిగా జీవితం ప్రారంభించిన ఆయన..తరువాత పలు పత్రికల్లో పనిచేశారు. ఆంగ్ల వార్తా సంస్థ యూఎన్‌ఐలోనూ పనిచేశారు. తర్వాత అమెరికా వెళ్లి కుటుంబంతో సహా న్యూయార్క్‌లో స్థిరపడ్డారు. పదిరోజుల క్రితం కరోనా బారినపడ్డ ఆయన..సోమవారం సాయంత్రం మరణించినట్లు న్యూయార్క్‌ ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు.

ఇదిలా ఉంటే, అమెరికాలో కరోనా మహమ్మారి బారిన పడి మరణిస్తున్న భారతీయుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే అమెరికాలో మొత్తం కరోనా మహమ్మారితో 12,800మంది మృత్యువాతపడగా కేవలం న్యూయార్క్‌ రాష్ట్రంలోనే 5400మంది మృతి చెందారు.

ఇవీ చదవండి..

అమెరికాలో ఒక్కరోజే 1900 మంది మృతి

భారత్‌లో కరోనా: 149 మరణాలు, 5194 కేసులు

 

 

 

 

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని