నిత్యావసరాల కొనుగోలుకు ఎఫ్‌సీఐ అనుమతి

కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా సహయ చర్యల్లో పాల్గొనే స్వచ్ఛంద సంస్థలు, ఛారిటీలు భారత ఆహార సంస్థ(ఎఫ్‌సీఐ) నుంచి నేరుగా నిత్యావసరాలు కొనుగోలు చేయవచ్చని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ-ఆక్షన్‌ విధానాన్ని అనుసరించాల్సిన

Updated : 08 Apr 2020 23:52 IST

దిల్లీ: కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా సహయ చర్యల్లో పాల్గొనే స్వచ్ఛంద సంస్థలు, ఛారిటీలు భారత ఆహార సంస్థ(ఎఫ్‌సీఐ) నుంచి నేరుగా నిత్యావసరాలు కొనుగోలు చేయవచ్చని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ-ఆక్షన్‌ విధానాన్ని అనుసరించాల్సిన అవసరం లేదని వెల్లడించింది. లాక్‌డౌన్‌ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు రాష్ట్రాలకు పది లక్షల టన్నుల ఆహార పదార్థాలు ఇచ్చినట్లు కేంద్రం పేర్కొంది. 2.2 మిలియన్ టన్నుల ఆహార పదార్ధాలను... నిల్వ ఎక్కువ ఉన్న రాష్ట్రాల నుంచి సరఫరా చేసినట్లు వెల్లడించింది. ఏ రాష్ట్రంలో ఆహార నిల్వలు ఎంత ఉన్నాయో ప్రతిరోజు సమీక్షిస్తున్నట్లు తెలిపింది. ధరలు పెరగకుండా, మార్కెట్‌లో కూడా ఆహార పదార్థాల కొరత లేకుండా చర్యలు తీసుకుంటోందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. 
 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని