శునకంతో షికారా.. అయితే జైలుకే..

కరోనా వైరస్‌ నేపథ్యంలో ప్రపంచంలోని అనేక దేశాల్లో లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. వైరస్‌ వ్యాప్తి చెందకుండా నివారించేందుకు లాక్‌డౌన్‌ ఒక్కటే...

Updated : 09 Apr 2020 17:23 IST

మాస్కో: కరోనా వైరస్‌ నేపథ్యంలో ప్రపంచంలోని అనేక దేశాల్లో లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. వైరస్‌ వ్యాప్తి నివారించేందుకు లాక్‌డౌన్‌ ఒక్కటే పరిష్కారమని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. దీంతో పలు దేశాలు లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేస్తున్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించిన వారిపై కేసులు నమోదుచేస్తున్నారు. 

మాస్కోలో శునకంతో షికారుకు వెళ్లి..
రష్యాలో వైరస్‌ వ్యాప్తి నివారణకు కఠినమైన నిబంధనలు అమలుచేస్తున్నారు. తామున్న నివాసం నుంచి 100 మీటర్లు వరకు మాత్రమే తిరిగేందుకు అనుమతిస్తున్నారు.  అంతకు అతిక్రమించితే అరెస్టు చేసి కోర్టులో హాజరుపరుస్తున్నారు.  మాస్కోకు చెందిన జీసస్‌ వొరబయెవ్‌ తన పెంపుడు శునకంతో కలిసి తన ఇంటికి సమీపంలోనే ఉన్న పార్కుకు బయలుదేరాడు. పార్కులోపలకు ఎవరూ ప్రవేశించకుండా అధికారులు గేట్లను మూసివేశారు. భారీగా పోలీసు బలగాలు కూడా ఉన్నాయి. అయితే దీన్ని పట్టించుకోని వొరబయెవ్‌ పార్కు వద్దకు చేరుకున్నాడు. తన ఇంటి వద్ద నుంచి ఏకంగా 100 మీటర్లు దాటినట్టు తెలుసుకున్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. వెంటనే వ్యాన్‌లో తరలించారు. అయితే ఏమీ అర్థంకాని శునకం కొంచం సేపు అక్కడే తిరిగి వెనక్కు వెళ్లిపోయింది.

అనంతరం కోర్టులో అతన్ని హాజరుపరచడంతో న్యాయమూర్తి జరిమానా విధించాడు. రష్యాలో ఇంటినుంచి బయటకు వెళ్లాలంటే ఆన్‌లైన్‌లో అనుమతి తీసుకోవాలి.  అందులో ఎక్కడ వరకు వెళ్లాలో అక్కడ వరకు మాత్రమే వెళ్లాలి.  అతిక్రమిస్తే అపరాధంతో పాటు జైలు శిక్ష కూడా విధిస్తారు.

 

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని