వైద్య సిబ్బంది రక్షణకు ‘రోబో’

కరోనా బాధితులకు సేవలందిస్తోన్న వైద్య సిబ్బందిని రక్షించడానికి ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఓ ఇంజినీరింగ్‌ విద్యార్థి రోబోను తయారు చేశాడు. కరోనా రోగులకు వైద్యం చేస్తూ ఆ మహమ్మారి బారిన పడే వైద్యుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోన్న క్రమంలో రోగులకు సపర్యలు చేసేందుకు తన స్నేహితులతో కలిసి.. 

Updated : 08 Dec 2022 16:32 IST

కరోనా రోగులకు సేవలందించేందుకు ఏర్పాటు 

రాయ్‌పూర్‌: కరోనా బాధితులకు సేవలందిస్తోన్న వైద్య సిబ్బందిని రక్షించడానికి ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఓ ఇంజినీరింగ్‌ విద్యార్థి రోబోను తయారు చేశాడు. కరోనా రోగులకు వైద్యం చేస్తూ ఆ మహమ్మారి బారిన పడే వైద్యుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న క్రమంలో రోగులకు సపర్యలు చేసేందుకు తన స్నేహితులతో కలిసి రోబోను తయారు చేసినట్లు బీటెక్‌ విద్యార్థి యోగేశ్‌ సాహూ చెప్పాడు. ఐసోలేషన్‌ వార్డుల్లోని రోగులకు ఆహారం, ఔషధాలు అందించేందుకు వైద్య సిబ్బంది వీటిని ఉపయోగించుకోవచ్చని ఆయన తెలిపారు. ఈ రోబో ఇంటర్‌నెట్‌ ఆధారంగా పని చేస్తోందని.. ప్రభుత్వం ప్రోత్సహిస్తే మరింత అభివృద్ధి చేసి వైద్యులకు అందిస్తానని తెలిపారు. 

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని