మెరుగైన బోరిస్‌ జాన్సన్‌ ఆరోగ్యం

కరోనా మహమ్మారి బారిన పడ్డ యూకే ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ ఆరోగ్యం మెరుగైంది. దీంతో ఆయనను వైద్యులు ఐసీయూ నుంచి సాధారణ వార్డుకు తరలించారు. మరికొన్నాళ్లు ఆస్పత్రిలోనే ఉండి చికిత్స తీసుకోవాలని వైద్యులు ఆయనకు సూచించారు. 

Updated : 10 Apr 2020 06:19 IST

లండన్‌: కరోనా మహమ్మారి బారిన పడ్డ యూకే ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ ఆరోగ్యం మెరుగైంది. దీంతో ఆయనను వైద్యులు ఐసీయూ నుంచి సాధారణ వార్డుకు తరలించారు. మరికొన్నాళ్లు ఆస్పత్రిలోనే ఉండి చికిత్స తీసుకోవాలని వైద్యులు ఆయనకు సూచించారు. 

అంతకుముందు బోరిస్‌కు కరోనా పాజిటివ్‌ తేలడంతో స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. అయితే వైరస్‌ లక్షణాలు కనిపిస్తుండడంతో ఆదివారం ఆయన్ను ఆస్పత్రిలోలో చేర్చారు. అనంతరం వాధి తీవ్రత పెరగడంతో వెంటనే ఐసీయూకి తరలించారు. ప్రపంచ వ్యాప్తంగా 15,69,002 మంది కరోనా మహమ్మారి బారిన పడ్డారు. మృతుల సంఖ్య 92,109కి చేరింది. ఇక అమెరికాలో మరణ మృదంగం మోగుతూనే ఉంది. ఇప్పటికే 4,54,615 కరోనా కేసులు నమోదు కాగా, 16,074 మంది మృతి చెందారు. ఇటలీలో కరోనా మృతుల సంఖ్య 18,279కి చేరింది. ఇక భారత్‌లో 5,865 మంది దీని బారిన పడగా, 169 మంది చనిపోయారు. గురువారం ఒక్కరోజే 591 మంది కరోనా బారిన పడ్డారు. 

మరోవైపు కరోనాకు మందుగా భావిస్తున్న హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ ఇజ్రాయిల్‌కు ఎగుమతి చేయడంపై ఆ దేశ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహూ భారత ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు