చైనాపై ప్రతీకారానికి దిగిన అమెరికా!

కరోనా వైరస్‌పై సరైన సమాచారం ఇవ్వలేదని చైనాపై దుమ్మెత్తిపోస్తున్న అమెరికా ఆ దేశంపై ప్రతీకార చర్యలకు పూనుకుంది! దేశ భద్రతకు ముప్పుందని అమెరికాలో సేవలందిస్తున్న చైనా టెలికాం సంస్థపై నిషేధానికి సిద్ధమవుతోంది. చైనా టెలికాం (అమెరికా) సంస్థపై ఆంక్షలు విధించాలని, అనుమతులు....

Published : 11 Apr 2020 00:20 IST

అమెరికాలోని చైనా టెలికాం సంస్థ అనుమతుల రద్దుకు ప్రతిపాదన

వాషింగ్టన్‌: కరోనా వైరస్‌పై సరైన సమాచారం ఇవ్వలేదని చైనాపై దుమ్మెత్తిపోస్తున్న అమెరికా.. ఆ దేశంపై ప్రతీకార చర్యలకు పూనుకుంది! దేశ భద్రతకు ముప్పుందని అమెరికాలో సేవలందిస్తున్న ‘చైనా టెలికాం’ సంస్థపై నిషేధానికి సిద్ధమవుతోంది. చైనా టెలికాం (అమెరికా) సంస్థపై ఆంక్షలు విధించాలని, అనుమతులు రద్దుచేయాలని ఫెడరల్‌ కమ్యూనికేషన్‌ కమిషన్‌ (ఎఫ్‌సీసీ)కు రక్షణ, హోం, వాణిజ్య సహా అత్యున్నత శాఖలు సూచించాయి.

‘చైనా టెలికాం వల్ల దేశ రక్షణ, భద్రత, ఆర్థిక, న్యాయ వ్యవస్థకు ముప్పుందని అధికార వర్గాలు గుర్తించాయి. ప్రజాప్రయోజనార్థం ఆ సంస్థ లైసెన్సులను ఎఫ్‌సీసీ రద్దు చేయాలి’ అని న్యాయశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇది గనక ఆమోదం పొందితే చైనా టెలికాం సేవలు పొందుతున్న అమెరికాలోని లక్షలాది మొబైల్‌, ఇంటర్నెట్‌ వినియోగదారులు కమ్యూనికేషన్‌ సంబంధాలు కోల్పోయే అవకాశం ఉంది. అయితే సదరు సంస్థపై బీజింగ్‌ దోపిడీ, నియంత్రణ, ప్రభావం ఉన్నాయని న్యాయశాఖ, వాణిజ్య శాఖలు అంటున్నాయి.

అమెరికాపై చైనా సైబర్‌ నిఘాకు, ఆర్థిక గూఢచర్యం, ఆర్థిక కార్యకలాపాలకు అంతరాయం కలిగించేలా చైనా టెలికాం యూఎస్‌ ఆపరేషన్స్‌ ఉంటున్నాయని ఆ శాఖలు తెలిపాయి. అమెరికా కమ్యూనికేషన్లను సైతం దారి మళ్లిస్తున్నారని ఆరోపించాయి. ఈ నేపథ్యంలో ఎఫ్‌సీసీ ఎలాంటి చర్యలు తీసుకుంటోందనన్న ఆసక్తి ఏర్పడింది. ఈ వ్యవహారంలో వైట్‌హౌజ్‌ కచ్చితంగా జోక్యం చేసుకుంటుందని సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని