‘తబ్లిగీ’ని దాచిన నేత.. కుటుంబానికి కరోనా

నిజాముద్దీన్‌ మర్కజ్‌ తబ్లిగీ జమాత్‌ సమ్మేళనంలో పాల్గొన్న విషయాన్ని దాచిన దిల్లీ కాంగ్రెస్‌ నేత, మాజీ కౌన్సిలర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. అంతకు ముందు ఆయన్ను పోలీసులు పదేపదే ప్రశ్నించినప్పటికీ మర్కజ్‌.......

Published : 11 Apr 2020 00:19 IST

ఒక్కరి నిర్లక్ష్యంతో ఊరంతా లాక్‌డౌన్‌

దిల్లీ: నిజాముద్దీన్‌ మర్కజ్‌ తబ్లిగీ జమాత్‌ సమ్మేళనంలో పాల్గొన్న విషయాన్ని దాచిన దిల్లీ కాంగ్రెస్‌ నేత, మాజీ కౌన్సిలర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. అంతకు ముందు ఆయన్ను పోలీసులు పదేపదే ప్రశ్నించినప్పటికీ మర్కజ్‌ విషయాన్ని బయటకు చెప్పలేదు. ఇప్పుడు ఆయనతో పాటు సతీమణి, కుమార్తెకు కొవిడ్‌-19 సోకినట్టు తేలడంతో కలకలం రేగింది.

ప్రస్తుతం ఆ వ్యక్తి సతీమణి కౌన్సిలర్‌గా సేవలందిస్తున్నారు. వైరస్‌ సోకిన ఈ ముగ్గురినీ అంబేడ్కర్‌ ఆస్పత్రిలో చేర్చామని పోలీసులు మీడియాకు తెలిపారు. ఒక్కరి నిర్లక్ష్యం వల్ల ఇప్పుడు దక్షిణ దిల్లీలోని దీన్‌పుర్‌ గ్రామం మొత్తాన్ని కంటైన్‌మెంట్‌ జోన్‌గా ప్రకటించాల్సి వచ్చిందని అంటున్నారు. అంటే నిత్యావసరాలకు సైతం ప్రజలు బయటకు రావడానికి వీల్లేదు. ప్రభుత్వమే వారికి అన్నీ సమకూరుస్తుంది.

‘గత నెల్లో నిజాముద్దీన్‌ మర్కజ్‌కు వెళ్లారా? అని ఆరా తీయగా ఆయన విషయాన్ని దాచిపెట్టారు. అప్పుడాయనలో లక్షణాలేమీ కనిపించలేదు. కానీ సాంకేతికంగా దర్యాప్తు చేయడంతో తబ్లిగీ జమాత్‌తో ఆయన సంబంధం బయటపడింది. ఆయన్ను ఇంట్లోనే క్వారంటైన్‌ చేశాం. మళ్లీ తనిఖీకి వచ్చినప్పుడు ఇంట్లో కనిపించలేదు. ఎన్నిసార్లు అడిగినా ఒప్పుకోకపోవడంతో కాల్‌ రికార్డులను పరిశీలించాం. అప్పుడు మర్కజ్‌కు వెళ్లిన సంగతి బయటపడింది’ అని పోలీసులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని