కరోనాపై ఐదేళ్ల చిన్నారి అవగాహన 

కెనడాకు చెందిన ఐదేళ్ల చిన్నారి నోవా నైట్‌ కరోనాపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తోంది.  లాక్‌డౌన్‌ కారణంగా ఇంట్లో ఉన్న పిల్లలను వీడియోలతో చైతన్యం చేసేందుకు కృషి చేస్తోంది. ‘వన్ గుడ్‌ థింగ్‌’ పేరుతో.. 

Published : 11 Apr 2020 22:17 IST

అట్టావా : కెనడాకు చెందిన ఐదేళ్ల చిన్నారి నోవా నైట్‌ కరోనాపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తోంది.  లాక్‌డౌన్‌ కారణంగా ఇంట్లో ఉన్న పిల్లలను వీడియోలతో చైతన్యం చేసేందుకు కృషి చేస్తోంది. ‘వన్ గుడ్‌ థింగ్‌’ పేరుతో చేస్తున్న ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో పిల్లలు ఆటల పేరుతో బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండాలని సూచిస్తూ.. ఎప్పటికప్పుడు చేతులను శుభ్రం చేసుకుంటూ జాగ్రత్తలు తీసుకోవాలని హితువు పలుకుతోంది. బయటకు వెళ్లే పెద్దలు కూడా కనీసం ఆరడుగుల దూరం పాటించాలని కోరింది. వైరల్‌గా మారిన ఈ వీడియోలను చూసిన కెనడా ప్రధాని జస్టిస్‌ ట్రూడో చిన్నారి ప్రయత్నాన్ని ప్రశంసిస్తూ రీట్వీట్‌ చేశారు. 

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని