అమెరికాకు చేరిన క్లోరోక్విన్‌ మాత్రలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అభ్యర్థన మేరకు భారత్‌ పంపిన హైడ్రాక్సీక్లోరోక్విన్‌ సహా ఇతర ప్రాణాధార ఔషధాలు అమెరికాకు చేరాయి. ప్రత్యేక కార్గో విమానంలో పంపిన ఈ మందులు........

Updated : 12 Apr 2020 13:25 IST

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అభ్యర్థన మేరకు భారత్‌ పంపిన హైడ్రాక్సీక్లోరోక్విన్‌ సహా ఇతర ప్రాణాధార ఔషధాలు అమెరికాకు చేరాయి. ప్రత్యేక కార్గో విమానంలో పంపిన ఈ మందులు శనివారం సాయంత్రం న్యూజెర్సీలోని నెవార్క్‌ అంతర్జాతీయ విమానానికి చేరుకున్నట్లు అమెరికాలోని భారత రాయబారి తరణ్‌జిత్‌ సంధు వెల్లడించారు. కొవిడ్‌-19 చికిత్సలో క్లోరోక్విన్‌ మాత్రలు ఆశాజనక ఫలితాలు ఇస్తున్నాయని.. వీటిని రోగులు, వారికి దగ్గరగా ఉండేవారికి ఇవ్వొచ్చని ‘ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌’‌(ఎఫ్‌డీఏ) సూచించిన విషయం తెలిసిందే. 

అమెరికాలో వైరస్‌ తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఆదివారం ఉదయానికి ఆ దేశంలో 5,33,259 మంది వైరస్‌ బారినపడగా.. వీరిలో 20,597 మంది మృత్యువాతపడ్డారు. ప్రతిరోజు రికార్డు స్థాయిలో మరణాలు నమోదవుతున్నాయి. ఈ తరుణంలో చికిత్సలో కీలకంగా భావిస్తున్న హైడ్రాక్సీక్లోరోక్విన్‌ అమెరికాకు చేరడం అక్కడి ప్రభుత్వానికి ఉపశమనం కలిగించే విషయమని చెప్పొచ్చు.

తొలుత వీటి ఎగుమతులపై భారత్‌ నిషేధం విధించింది. కానీ, ప్రపంచ దేశాల నుంచి డిమాండ్‌ పెరగడంతో మానవతా దృక్పథంలో వ్యహరించిన భారత్‌ నిషేధాన్ని పాక్షికంగా ఎత్తివేసింది. భారత అవసరాలకు సరిపడా నిల్వలు ఉంచుకొని మిగిలిన వాటిని ఆయా దేశాలకు సరఫరా చేస్తోంది.

ఇవీ చదవండి..

24గంటల్లో భారత్‌లో 909కేసులు..34మరణాలు

అమెరికా చరిత్రలోనే ఇలా చేయడం తొలిసారి..!


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని