పీఎం-కేర్స్‌పై వ్యాజ్యం తిరస్కరించిన సుప్రీం

పీఎం-కేర్స్‌ నిధి ఏర్పాటు నిర్ణయాన్ని ప్రశ్నిస్తూ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని విచారించేందుకు సుప్రీంకోర్టు తిరస్కరించింది. న్యాయవాది ఎంఎల్‌ శర్మ దాఖలు చేసిన పిల్‌ తప్పుగా ఉందని ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ బోబ్డే, జస్టిస్‌ ఎల్‌ నాగేశ్వర రావు, జస్టిస్‌ ఎంఎం శాంతనగౌదర్‌ ధర్మాసనం తెలిపింది. విచారణను ధర్మాసనం....

Published : 13 Apr 2020 23:40 IST

దిల్లీ: పీఎం-కేర్స్‌ నిధి ఏర్పాటు నిర్ణయాన్ని ప్రశ్నిస్తూ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని విచారించేందుకు సుప్రీంకోర్టు తిరస్కరించింది. న్యాయవాది ఎంఎల్‌ శర్మ దాఖలు చేసిన పిల్‌ తప్పుగా ఉందని ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ బోబ్డే, జస్టిస్‌ ఎల్‌. నాగేశ్వర రావు, జస్టిస్‌ ఎంఎం శాంతనగౌడర్‌లతో కూడిన ధర్మాసనం తెలిపింది. విచారణను ధర్మాసనం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా చేపట్టింది.

రాజ్యాంగంలోని 266, 267 అధికరణాల ప్రకారం పీఎం- కేర్స్‌ నిధి ఏర్పాటు చేయలేదన్న న్యాయవాది ఉద్దేశంతో ధర్మాసనం ఏకీభవించలేదు. కరోనా తరహా అత్యవసర పరిస్థితుల్లో ఆదుకోవడానికి పీఎం-కేర్స్‌ను మార్చి 28న ప్రధాని ఏర్పాటు చేశారు. దీనికి ప్రధాని ఎక్స్‌ అఫీసియో ఛైర్మన్‌ కాగా రక్షణ, హోం, ఆర్థిక మంత్రులు ఎక్స్‌ అఫీసియో ట్రస్టీలుగా ఉంటారు.

ఎలాంటి ఆర్డినెన్స్‌, గెజిట్‌ నోటిఫికేషన్‌ లేకుండా నిధిని ఏర్పాటు చేశారని ఎంఎల్‌ శర్మ పిల్‌ను దాఖలు చేశారు. ఇప్పటి వరకు సేకరించిన మొత్తాన్ని కన్సాలిడేటెట్‌ ఫండ్‌ ఆఫ్‌ ఇండియాకు బదిలీ చేయాలని కోరారు. ప్రస్తుత నిధిని అధికరణం 267 ప్రకారం ఏర్పాటు చేయలేదని, పార్లమెంటు లేదా రాష్ట్రపతి ఆమోదం కానీ లేదని తెలిపారు. కోర్టు పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్‌) ఏర్పాటు చేయాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని