పేదలకు మాత్రమే కరోనా ఉచిత పరీక్షలు:సుప్రీం

కరోనా వైరస్‌ పరీక్షలు కేవలం పేదలకు మాత్రమే ఉచితంగా చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. వారితో పాటు ఎవరెవరికీ పరీక్షలు ఉచితంగా నిర్వహించాలనే నిర్ణయాన్ని ప్రభుత్వమే తీసుకోవాలని సూచించింది. గత వారం మహమ్మారి నిర్ధారణ

Published : 14 Apr 2020 01:28 IST

దిల్లీ: కరోనా వైరస్‌ పరీక్షలు కేవలం పేదలకు మాత్రమే ఉచితంగా చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. వారితో పాటు ఎవరెవరికీ పరీక్షలు ఉచితంగా నిర్వహించాలనే నిర్ణయాన్ని ప్రభుత్వమే తీసుకోవాలని సూచించింది. గత వారం మహమ్మారి నిర్ధారణ పరీక్షలు అందరికీ చేయాలని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. అయితే ప్రైవేట్‌ లాబొరేటరీస్‌ ఉచితంగా చేయలేమని పేర్కొనడంతో తాజాగా ఈ నిర్ణయాన్ని తీసుకుంది.

‘‘ఆయుష్మాన్‌ భారత్‌ పథకానికి అర్హులైన వారికి, ప్రభుత్వం గుర్తించిన ఆర్థిక బలహీన వర్గాలకు ఉచితంగా పరీక్షలు నిర్వహించాలి’’ అని సుప్రీంకోర్టు ఉత్తర్వులో తెలిపింది. వారితో పాటు అనధికారిక రంగాలలో తక్కువ ఆదాయం సంపాదించే కార్మికులకు, ప్రత్యక్ష ప్రయోజన బదిలీలు పొందే లబ్ధిదారులకు లేదా ఇతర వర్గాలకు కూడా ఉచితంగా నిర్వహించడంపై కేంద్రం, వైద్యారోగ్య శాఖ నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. తీసుకున్న నిర్ణయాన్ని వారం రోజుల్లోగా తెలియజేయాలని ఆదేశించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని