కరోనాకు టీబీ వ్యాక్సిన్‌... పనికొస్తుందా?

కరోనా వైరస్‌ (కొవిడ్‌-19) నివారణకు బీసీజీ వ్యాక్సిన్‌ ఉపయోగపడుతుందనే వాదనలను ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఓ) తోసిపుచ్చింది.

Published : 14 Apr 2020 17:38 IST

దిల్లీ: కరోనా వైరస్‌ (కొవిడ్‌-19) నివారణకు బీసీజీ వ్యాక్సిన్‌ ఉపయోగపడుతుందనే వాదనలను ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఓ) తోసిపుచ్చింది. నిజానికి బాసిల్ కాల్మెట్ గురిన్ లేదా బీసీజీ టీకాను క్షయవ్యాధి రాకుండా నిరోధించటానికి వాడతారు. ఈ టీకాను వాడిన దేశాల్లో కరోనా వ్యాప్తి తక్కువగా ఉందంటూ వచ్చిన మూడు పరిశోధనలను పరిశీలించిన అనంతరం సంస్థ ఈ విధంగా ప్రకటించింది.

బీసీజీ వాడిన దేశాలలో కరోనా కేసులు, వాడని దేశాల కంటే తక్కువగా ఉన్నట్టు తమ పరిశీలనలో తేలిందని భారత్‌లోని పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ (చండీఘడ్‌)తో సహా న్యూయార్క్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (న్యూయార్క్‌), ఆండర్సన్‌ క్యాన్సర్‌ సెంటర్‌ (టెక్సాస్)ల పరిశోధకులు తెలియచేశారు. అయితే బీసీజీ టీకా వ్యాధి నిరోధక వ్యవస్థపై ప్రభావం చూపించదు అనేందుకు ప్రమోగాత్మక ఆధారాలు ఉన్నాయని డబ్ల్యుహెచ్‌వో తెలిపింది. ఈ విషయమై ప్రయోగాలు ఇంకా కొనసాగుతున్నాయని,  ప్రస్తుతానికి ఇందుకు నిరూపిత ఆధారాలు ఏవీ లేనందున, కొవిడ్‌-19 నివారణకు తాము బీసీజీ టీకాను సిఫార్సు చేయబోమని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని