రాబోయే రెండు మూడు వారాలే కీలకం

దేశంలో ఇప్పటి వరకు దాదాపు 400 జిల్లాలో కరోనా కేసులు నమోదు కాలేదని, రాబోయే రెండు వారాలు కరోనా నియంత్రణకు ఎంతో కీలకం అని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్‌ అన్నారు. కరోనా నియంత్రణలో భారత్ వ్యవహరించిన......

Published : 15 Apr 2020 23:43 IST

దిల్లీ: దేశంలో ఇప్పటి వరకు దాదాపు 400 జిల్లాలో కరోనా కేసులు నమోదు కాలేదని, రాబోయే రెండు వారాలు కరోనా నియంత్రణకు ఎంతో కీలకం అని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్‌ అన్నారు. ‘‘కరోనా నియంత్రణలో భారత్ వ్యవహరించిన విధానం ప్రపంచలోనే అత్యుత్తమం. ఇతర దేశాల కంటే మనం ఎంతో మెరుగ్గా వైరస్‌ను అదుపులో ఉంచాం. ప్రధాని నరేంద్ర మోదీ ప్రతి విషయాన్ని ఉన్నతస్థాయిలో సమీక్షించి నిపుణులు, క్షేత్రస్థాయి సిబ్బంది, శాస్త్రవేత్తల నుంచి సలహాలను తీసుకున్నారు. దేశంలో 400 జిల్లాలో కరోనా వ్యాపించలేదు. రాబోయే రెండు-మూడు వారాలు భారత్‌లో కరోనా కట్టడికి ఎంతో కీలకం’’ అని తెలిపారు.   

‘‘45 ఏళ్లుగా నేను ఆరోగ్య రంగంలో పనిచేస్తున్నాను. ఇటువంటి మహమ్మారిని ఎప్పుడూ చూడలేదు. 1994లో ప్లేగు, 2014లో ఎబోలా వంటి వ్యాధులు ఎంతో సమర్థంగా ఎదుర్కొన్నాం. మశూచి, పోలియో వంటి వ్యాధులను పూర్తిగా నివారించాం. 2025-30 నాటికి  తట్టు, బ్లాక్‌ ఫీవర్‌ వ్యాధులను రూపుమాపాలనుకుంటున్నాం. వైద్యారోగ్య మంత్రిత్వశాఖలో ఇంతటి ఆత్మవిశ్వాసానికి కారణం కరోనా నివారణకు ముందుండి పోరాడుతున్న వైద్యారోగ్య సిబ్బందే కారణం’’ అని మంత్రి వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని