కరోనాకు యూరప్‌లో 90,000 మంది బలి

ప్రపంచాన్ని చుట్టేసిన కరోనా మహమ్మారి యూరప్‌లో మరింత ప్రతాపాన్ని చూపిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా మరణించిన వారిలో దాదాపు 65 శాతం మంది ఇక్కడి వారే కావడం ...

Published : 16 Apr 2020 22:39 IST

పారిస్‌: ప్రపంచాన్ని చుట్టేసిన కరోనా మహమ్మారి యూరప్‌లో మరింత ప్రతాపాన్ని చూపిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా మరణించిన వారిలో దాదాపు 65 శాతం మంది ఇక్కడి వారే కావడం అందుకు నిదర్శనం. ఇప్పటి వరకు ఐరోపా ఖండంలో 10,47,279 మందికి ఈ వైరస్‌ సోకగా.. 90,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు ఏఎఫ్‌పీ వార్తా సంస్థ తాజాగా వెల్లడించింది. ఐరోపా ఖండంలో  ఇటలీ, ఫ్రాన్స్‌, యూకే, నెదర్లాండ్స్‌, స్విట్జర్లాండ్‌ తదితర దేశాలున్నాయి. ఏఎఫ్‌పీ విడుదల చేసిన ఈ  ఆయా దేశాల్లో వైరస్‌ వ్యాప్తి తీవ్రతకు అద్దం పడుతున్నాయి. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 1,37,499 కొవిడ్‌ మరణాలు సంభవించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) వెల్లడించింది.

మరోవైపు భారత్‌లోనూ వైరస్‌ సోకిన వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ఇప్పటి వరకు 12,380 మంది ఈ వైరస్‌ బారిన పడగా..414 మంది ప్రాణాలు కోల్పోయారు.మరో 1489 మంది కొవిడ్ నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. గడచిన 24 గంటల్లో 941 కొత్త కేసులు నమోదు కాగా.. 37 మంది మరణించినట్లు కేంద్రం వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని