
Published : 17 Apr 2020 01:20 IST
దేశవ్యాప్తంగా 325 జిల్లాల్లో కరోనా లేదు!
దిల్లీ: దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 325 జిల్లాల్లో కరోనా కేసులు నమోదు కాలేదని కేంద్ర ప్రభుత్వం గురువారం వెల్లడించింది. మరో 27 జిల్లాల్లో గత 14 రోజులుగా కొత్త కేసులు నమోదవ్వలేదని తెలిపింది. పుదుచ్చేరిలోని మహి జిల్లాలో గత 28 రోజులుగా ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం గమనార్హం. మరోవైపు దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 12,759 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. 420 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 1515 మంది వైరస్ నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 826 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
Tags :