లాక్‌డౌన్‌ వేళ కలబురిగిలో గుంపుగా జనం 

దేశవ్యాప్తంగా మే 3 వరకు రెండో దశ లాక్‌డౌన్‌ ప్రకటిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్నప్పటకీ కొందరు నిబంధనలు ఉల్లఘించి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మతపరమైన అన్ని కార్యక్రమాలు రద్దు చేయాలని ప్రభుత్వం

Published : 16 Apr 2020 23:43 IST

కలబురిగి: దేశవ్యాప్తంగా మే 3 వరకు రెండో దశ లాక్‌డౌన్‌ ప్రకటిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్నప్పటకీ కొందరు నిబంధనలు ఉల్లఘించి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మతపరమైన అన్ని కార్యక్రమాలు రద్దు చేయాలని ప్రభుత్వం ఆదేశించినప్పటికీ  పెడచెవిన పెడుతున్నారు. దీంతో కొన్ని చోట్ల నిబంధనలకు విరుద్ధంగా కొందరు ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. తాజాగా కర్ణాటకలోని కలబురిగిలో సిద్ధలింగేశ్వర ఆలయంలో గురువారం ఉత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దాదాపు 100 నుంచి 150 మంది ప్రజలు పాల్గొన్నారు. ఇప్పటికే కలబురిగి ప్రాంతాన్ని కేంద్రం ప్రజ్వలన కేంద్రం(హాట్‌స్పాట్‌)గా ప్రకటించింది. ఈ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో ప్రజలు గుంపుగా ఒక చోటుకు చేరడం ఆందోళన కలిగిస్తోంది. 

దీనిపై కలబురిగి ఎస్పీ మార్టిన్ మార్బనియాంగ్ మాట్లాడుతూ.. ‘‘దాదాపు 100 నుంచి 150 మంది సాయంత్రం ఆరున్నర గంటల ప్రాంతంలో స్థానికంగా ఉన్న సిద్ధలింగేశ్వర ఆలయంలో జరిగే ఉత్సవాల్లో పాల్గొనేందుకు బయటికి వచ్చారు. దాదాపు 20 నిమిషాల పాటు జరిగిన రథోత్సవంలో వారంతా పాల్గొన్నారు. లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లఘించి ఎక్కువ మంది ఒకే చోట సమావేశం కావడంపై ఆలయ కమిటీ సభ్యులతో పాటు మరో 20 మందిపై కేసు నమోదు చేశాం. మరికొంత మందిని గుర్తించాల్సి ఉందని’’ ఆయన తెలిపారు. గతంలో ఉత్సవాలు నిర్వహించవద్దని ఆలయ కమిటీకి సూచించినప్పటికీ ఈ కార్యక్రమం నిర్వహించిందని ఎస్పీ పేర్కొన్నారు. కర్ణాటకలో ఇప్పటి వరకు 315 కరోనా కేసులు నమోదయ్యాయి. వీరిలో 82 మంది కోలుకున్నారు. 13 మంది మృతిచెందారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని