హెల్త్‌ అసిస్టెంట్‌గా స్వీడన్‌ రాకుమారి

కరోనా వైరస్‌ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. దీని బారిన పడి చిన్నా పెద్దా తేడా లేకుండా అనేక మంది మరణిస్తున్నారు. ఈ వైరస్‌ కట్టడికి పోరాడుతున్న స్వీడన్‌కు తన వంతు తోడ్పాటునందించేందుకు ఆ దేశ యువరాణి ప్రిన్సెస్‌ సోఫియా

Published : 17 Apr 2020 16:51 IST

ఇంటర్నెట్‌డెస్క్‌ : కరోనా వైరస్‌ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. దీని బారిన పడి చిన్నా పెద్దా తేడా లేకుండా అనేక మంది మరణిస్తున్నారు. ఈ వైరస్‌ కట్టడికి పోరాడుతున్న స్వీడన్‌కు తన వంతు తోడ్పాటునందించేందుకు ఆ దేశ యువరాణి ప్రిన్సెస్‌ సోఫియా స్వచ్ఛందంగా ముందుకొచ్చారు.  కొవిడ్‌-19పై పోరాడుతున్న తమ దేశ వైద్యసిబ్బందికి పలు సూచనలు ఇచ్చేందుకు ఆమె స్వీడన్‌ రాజధాని స్టాక్‌ హోమ్‌లోని ఓ ఆసుపత్రిలో హెల్త్‌కేర్‌ అసిస్టెంట్‌గా చేరారు.

కరోనా వ్యాప్తి నేపథ్యంలో వైద్యులు, నర్సులు, అధికారులపై పని భారం పెరిగిపోయింది.  ఈ నేపథ్యంలో క్లిష్ట పరిస్థితులను అర్థం చేసుకుని సేవ చేసేందుకు మనకు మనమే ముందుకు రావాలనే ఉద్దేశంతో ఆరోగ్య కార్యకర్తగా పనిచేసేందుకు రాకుమారి స్వచ్ఛందంగా ముందుకు వచ్చినట్లు ఆసుపత్రి అధికారులు వెల్లడించారు.  అయితే కొవిడ్‌ 19 బాధితుల విభాగానికి ఆమె నేరుగా సేవలందించరు. హెల్త్‌కేర్‌ నిపుణులకు వివిధ పనుల్లో తోడ్పాటునందిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని