లాక్‌డౌన్‌లో పెరుగుతున్న గృహహింస కేసులు

కరోనా వైరస్‌ నియంత్రణలో భాగంగా ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ కాలంలో దేశవ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న గృహహింస కేసులు సంఖ్య రోజురోజుకి పెరుగుతున్నాయని జాతీయ మహిళ కమిషన్ పేర్కొంది. ఈ మేరకు ఎన్‌సీడబ్ల్యూ తాజా గణాంకాలను..... 

Published : 18 Apr 2020 00:41 IST

దిల్లీ: కరోనా వైరస్‌ నియంత్రణలో భాగంగా ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ కాలంలో దేశవ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న గృహహింస కేసులు సంఖ్య రోజురోజుకి పెరుగుతున్నాయని జాతీయ మహిళ కమిషన్ (ఎన్‌సీడబ్ల్యూ) పేర్కొంది. ఈ మేరకు ఎన్‌సీడబ్ల్యూ తాజా గణాంకాలను విడుదల చేసింది. కేవలం మార్చి 23 నుంచి ఏప్రిల్ 16 మధ్య కాలంలో ఎన్‌సీడబ్ల్యూకు అందిన 587 ఫిర్యాదుల్లో 239 గృహహింసకు సంబంధించినవని తెలిపింది. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 22 మధ్య 123 గృహహింస కేసులు నమోదుకాగా, గత 25 రోజుల్లో ఈ సంఖ్య 239కి చేరిందని వెల్లడించింది. లాక్‌డౌన్‌ వల్ల ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావడంతో బాధితురాలు, నిందితుడు ఒకే చోట ఉండటంతో ఈ కేసులు సంఖ్య మరింత పెరుగుతోందని ఎన్‌సీ డబ్ల్యూ ఛైర్‌పర్సన్‌ రేఖా శర్మ పేర్కొన్నారు.

లాక్‌డౌన్‌ మొదలైనప్పటి నుంచి గృహహింసకు సంబంధించిన ఫిర్యాదులు వెల్లువెత్తుతుండటంతో ఎన్‌సీడబ్ల్యూ ఏప్రిల్ 10న ప్రత్యేక వాట్సాప్‌ నంబర్‌తో పాటు, కేసులను ఫాస్ట్‌ట్రాక్‌లో పరిష్కరించేందుకు ప్రత్యేక టీంను ఏర్పాటు చేసింది. నంబర్‌ కేటాయించిన నాటి నుంచి ఇప్పటి వరకు గృహహింసకు సంబంధించి 40 మెస్సేజ్‌లు వచ్చినట్లు తెలిపారు. వీటిపై సత్వర విచారణ జరిపి బాధిత మహిళకు స్థానిక పోలీసులు, అధికారుల సహాయంతో రక్షణ కల్పించనున్నట్లు ఎన్‌సీడబ్ల్యూ తెలిపింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని