ఆహార ధాన్యాలు,నగదు ఉచితంగా ఇవ్వండి

లాక్‌డౌన్‌ ప్రభావంతో ఆదాయం కోల్పోయిన పేదలకు ఉచితంగా ఆహార ధాన్యాలు ఇవ్వాలని, బ్యాంకు ఖాతాల్లోకి నగదు బదిలీ చేయాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత........

Published : 19 Apr 2020 11:10 IST

దిల్లీ: లాక్‌డౌన్‌ ప్రభావంతో ఆదాయం కోల్పోయిన పేదలకు ఉచితంగా ఆహార ధాన్యాలు ఇవ్వాలని, బ్యాంకు ఖాతాల్లోకి నగదు బదిలీ చేయాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం డిమాండ్‌ చేశారు. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో హృదయం లేని ప్రభుత్వం మాత్రమే ఏమీ చేయకుండా ఉండగలదని ఎద్దేవా చేశారు. ఆదాయం కోల్పోయిన పేదలు వండిన ఆహారం కోసం వరుసల్లో నిలబడుతున్నారని.. పేదల దుస్థితికి ఇంతకంటే నిదర్శనం ఏముంటుందని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వం ఉచితంగా ఆహారధాన్యాలను ఎందుకు పంపిణీ చేయడంలేదని చిదంబరం ప్రశ్నించారు. నగదు బదిలీ చేసి.. వరుసల్లో నిలబడి ఆహారాన్ని పొందుతున్న పేదల గౌరవాన్ని కాపాడాలని డిమాండ్‌ చేశారు. ‘ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా’(ఎఫ్‌సీఐ) వద్ద 77 మిలియన్‌ టన్నుల ధాన్యాలు ఉన్నాయని.. వాటిలో కొంత భాగాన్ని ప్రభుత్వం ఎందుకు పంచలేకపోతోందని నిలదీశారు. ఇవి ఆర్థికపరమైన ప్రశ్నలేగాక, నైతికతకు సంబంధించిన అంశాలు కూడా అని అభిప్రాయపడ్డారు. యావత్తు దేశం నిస్సహాయ స్థితిలో ఉన్న తరుణంలో ఈ సవాళ్లను పరిష్కరించడంలో ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ విఫలమయ్యారని విమర్శించారు.

ఇవీ చదవండి..
భారత్‌లో 500దాటిన కరోనా మరణాలు!

‘చైనాలోని ఆ మార్కెట్లను మూసివేయాలి’

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని