కెనడాలో కాల్పులు.. 16 మంది మృతి

కెనడాలో పోలీసు దుస్తులు ధరించి వచ్చిన ఓ దుండగుడు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. నోవా స్కోటియా రాష్ట్రంలో ఆదివారం జరిగిన ఈ ఘటనలో ఓ మహిళా

Updated : 20 Apr 2020 08:23 IST

గత 30ఏళ్ల చరిత్రలో అత్యంత దారుణ ఘటన

ఒట్టావా(కెనడా): కెనడాలో పోలీసు దుస్తులు ధరించి వచ్చిన ఓ దుండగుడు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. నోవా స్కోటియా రాష్ట్రంలో ఆదివారం జరిగిన ఈ ఘటనలో ఓ మహిళా పోలీసు సహా 16 మంది మృతిచెందారు. పోలీసుల కాల్పుల్లో దుండగుడు కూడా మృతిచెందినట్లు భావిస్తున్నారు. ఈ ఘటనతో అప్రమత్తమైన పోలీసులు, స్థానిక యంత్రాంగం.. ఇప్పటికే కరోనా వైరస్‌  వల్ల లాక్‌డౌన్‌లో ఉన్న ప్రజల్ని అసలే బయటకు రావొద్దని సూచించారు. దుండగుడు పోలీసుల దుస్తులు ధరించి, కారును కూడా పోలీసుల వాహనం వలే రూపొందించాడని అధికారులు తెలిపారు.

గత 30 ఏళ్ల కెనడా చరిత్రలో ఇంతటి దారుణ ఘటన జరగడం ఇదే తొలిసారని అధికారులు అభిప్రాయపడ్డారు. చివరి సారి 1989లో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో 14 మంది మృత్యువాతపడ్డారు. అప్పటి నుంచి దేశంలో తుపాకుల వాడకంపై కఠిన ఆంక్షలు విధించారు.     


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు