అమాంతం ఎగిరి.. అలా అవతలికి

అసలే ఖాళీ రోడ్డు. దానికి తోడు మితిమీరిన వేగం. అదే జోరులో కూడలి మధ్యలో ఉన్న గుండ్రటి దిమ్మెను బలంగా ఢీకొన్న ఓ కారు.. సినిమా షూటింగ్‌ తరహాలో అమాంతం గాల్లోకి ఎగిరి అలా కొద్ది దూరం ప్రయాణించి కింద పడింది.

Updated : 13 Sep 2023 12:44 IST

సినిమా షూటింగ్‌ తరహాలో కారు ప్రమాదం

వార్సా: అసలే ఖాళీ రోడ్డు. దానికి తోడు మితిమీరిన వేగం. అదే జోరులో కూడలి మధ్యలో ఉన్న గుండ్రటి దిమ్మెను బలంగా ఢీకొన్న ఓ కారు.. సినిమా షూటింగ్‌ తరహాలో అమాంతం గాల్లోకి ఎగిరి అలా కొద్ది దూరం ప్రయాణించి కింద పడింది. ఇటీవల పోలాండ్‌లో చోటుచేసుకున్న ఈ ప్రమాదం తాలుకూ సీసీ టీవీ ఫుటేజీని అక్కడి అధికారులు విడుదల చేశారు. దీంతో ఇది కాస్త సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. ఈ ప్రమాదంలో కారు శిథిలాల్లో ఇరుక్కుపోయిన డ్రైవర్‌ను అగ్నిమాపక సిబ్బంది బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. అతనికి ప్రాణాపాయం తప్పింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని