చైనా మరింత పారదర్శకంగా ఉండాలి: మెర్కెల్‌

కరోనా వైరస్‌ వ్యాప్తి విషయంలో చైనాపై పలు దేశాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్న వేళ జర్మనీ ఛాన్స్‌లర్‌ ఏంజెలా మెర్కెల్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. వైరస్‌ పుట్టుక, వ్యాప్తి విషయంలో డ్రాగన్‌ దేశం మరింత........

Updated : 21 Apr 2020 09:59 IST

బెర్లిన్‌: కరోనా వైరస్‌ వ్యాప్తి విషయంలో చైనాపై పలు దేశాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్న వేళ జర్మనీ ఛాన్స్‌లర్‌ ఏంజెలా మెర్కెల్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. వైరస్‌ పుట్టుక, వ్యాప్తి విషయంలో డ్రాగన్‌ దేశం మరింత పారదర్శకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని గుర్తుచేశారు. వైరస్‌ వెలుగులోకి వచ్చిన తొలినాళ్ల నాటి పరిస్థితులకు సంబంధించిన సమాచారాన్ని ప్రపంచంతో పంచుకోవాలని కోరారు. ‘‘ఈ మహమ్మారి పుట్టుక విషయంలో చైనా పారదర్శకంగా వ్యవహరించాలి. తద్వారా ప్రపంచం దీని నుంచి నేర్చుకునేందుకు అవకాశం ఏర్పుడుతుంది’’ అని విలేకరులతో మట్లాడుతూ మెర్కెల్‌ అన్నారు. 

ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా వైరస్‌ చైనాలోని వుహాన్‌లో తొలిసారి వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే, అది అక్కడే ఉన్న పీ4 వైరాలజీ ల్యాబ్‌ నుంచే బయటకు వచ్చిందని.. ఇదంతా చైనా కుట్ర అని అమెరికా సహా మరికొన్ని దేశాలు ఆరోపిస్తున్నాయి. అలాగే వైరస్‌ వ్యాప్తిపై ప్రపంచాన్ని హెచ్చరించడంలోనూ చైనా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పదే పదే ఆరోపిస్తున్నారు. దీనిపై విచారణ జరిపి నిజాలేంటో నిగ్గుతేలుస్తామని చెబుతున్నారు. ఇదే బాటలో ఆస్ట్రేలియా, ఫ్రాన్స్‌, బ్రిటన్‌ సైతం చైనా తీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.

ఇవీ చదవండి..
ఆయుర్దాతలకు ప్రాణగండం

చైనాకు నిపుణుల బృందం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని