ప్లాస్మా దానం చేయండి... 

కరోనా వైరస్‌ వ్యాధి వచ్చి తగ్గినవారు తమ ప్లాస్మాను దానమివ్వాలని దిల్లీలోని నిజాముద్దీన్‌కు చెందిన తబ్లిగి జమాత్‌ నేత మౌలానా సాద్‌ పిలుపునిచ్చారు.

Published : 22 Apr 2020 14:54 IST

తబ్లిగీ జమాత్‌ అధ్యక్షుడు మౌలానా సాద్‌

దిల్లీ: కరోనా వైరస్‌ సోకిన అనంతరం కోలుకున్నవారు తమ ప్లాస్మాను దానమివ్వాలని దిల్లీలోని నిజాముద్దీన్‌కు చెందిన తబ్లిగీ జమాత్‌ అధినేత మౌలానా సాద్‌ ఖంధాల్వి పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన ఓ లేఖను విడుదల చేశారు. ఇతర తబ్లిగీ సభ్యులతో సహా తాను స్వీయ నిర్బంధంలో ఉన్నట్లు తెలిపారు. తమతోపాటు క్వారంటైన్‌లో ఉన్న చాలామందికి కొవిడ్‌-19 పరీక్షలో నెగిటివ్‌గా వచ్చినట్లు వివరించారు. ఇక కరోనా నుంచి కోలుకున్నవారు తమ ప్లాస్మాను దానం చేయాలని... బాధితులకు చికిత్సలో అది ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు.  రంజాన్‌ ప్రార్థనలను ఇంట్లోనే చేసుకోవాల్సిందిగా కోరుతూ ఆయన ఇటీవల ప్రకటన విడుదల చేశారు. కాగా‌ నిబంధనలను అతిక్రమించి దిల్లీలోని నిజాముద్దీన్‌లో పెద్దసంఖ్యలో ప్రజలతో సమావేశాన్ని నిర్వహించినందుకు సాద్‌, మరికొందరిపై మార్చి 31న ఎఫ్‌ఐఆర్ నమోదైన సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని