చిన్నారుల్లో కొవిడ్‌ ‘డీకోడ్’

కరోనా వైరస్‌ ప్రభావం చిన్నారులపై ఎలా ఉండనుంది? పెద్దలతో పోలిస్తే లక్షణాల్లో తేడాలేమైనా ఉన్నాయా? నిజంగానే తీవ్రత తక్కువగా ఉందా? ఇలాంటి అంశాలపై కొన్ని సంస్థలు పరిశోధన నిర్వహించాయి. చైనా, సింగపూర్‌లో 1,065 మందితో నిర్వహించిన 18 అధ్యయనాలను ఈ బృందం...

Published : 24 Apr 2020 00:10 IST

లండన్‌: కరోనా వైరస్‌ ప్రభావం చిన్నారులపై ఎలా ఉండనుంది? పెద్దలతో పోలిస్తే లక్షణాల్లో తేడాలేమైనా ఉన్నాయా? నిజంగానే తీవ్రత తక్కువగా ఉందా? ఇలాంటి అంశాలపై కొన్ని సంస్థలు పరిశోధన నిర్వహించాయి. చైనా, సింగపూర్‌లో 1,065 మందితో నిర్వహించిన 18 అధ్యయనాలను ఈ బృందం పరిశీలించింది. అమెరికన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ జర్నల్‌లో తన నివేదికను ప్రచురించింది. ఇటలీలోని పావియా యూనివర్సిటీ సైతం ఇందులో భాగమైంది.

పెద్దలతో పోలిస్తే సాధారణంగా చిన్నారుల్లో లక్షణాలు స్వల్పంగా ఉంటున్నాయి. వారం నుంచి రెండు వారాల్లోనే వీరు కోలుకుంటున్నారని పరిశోధన ద్వారా తెలిసింది. పిల్లలకు కొవిడ్‌-19 సోకినప్పుడు జ్వరం, పొడిదగ్గు, అలసట వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. కొందరిలో లక్షణాలే బయటపడకపోవడం గమనార్హం. ఒక శిశువులో మాత్రం నిమోనియా, షాక్‌, మూత్రపిండాల వైఫల్యం కనిపించగా విజయవంతంగా చికిత్స చేశారు. 0-9 ఏళ్ల వారికి చికిత్స అందించగానే కోలుకున్నారు. చిన్నారులపై కొవిడ్‌-19 అసలైన ప్రభావాన్ని తెలుసుకోవాలంటే ఇంకా భారీ స్థాయిలో రోగులపై పరిశోధనలు జరగాలని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు.

చిన్నారుల ఆస్పత్రి నివేదికలు ఎక్కువగా లేకపోవడంతో పూర్తిస్థాయిలో పరిశోధించడం కుదరడం లేదని శాస్త్రవేత్తలు అంటున్నారు. జ్వరం, దగ్గు మాత్రమే వీరిలో కీలకమైన లక్షణాలని వెల్లడించారు. 13 నెలల ఒక చిన్నారిలో తీవ్ర లక్షణాలు కనిపించాయన్నారు. ఈ రోగిలో వాంతులు, విరేచనాలు, జ్వరం, నిమోనియా, షాక్‌, మెటబాలిక్‌ అసిడోసిస్‌, మూత్రపిండాల వైపల్యం కనిపించడంతో వెంటిలేటర్‌ సహాయం అవసరమైందన్నారు. ఒకరికి తప్ప ఎవరికీ ఆక్సిజన్‌ అందించాల్సిన పరిస్థితి రాలేదని తెలిపారు. 10-19 ఏళ్ల వారిలో ఒకరు మృతిచెందారని పేర్కొన్నారు.

సాధారణంగా తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల నుంచే చిన్నారులకు కరోనా వైరస్‌ సోకుతోందని వెల్లడించారు. వైరస్‌ భారం, లక్షణాల మధ్య సంబంధం కనిపించకపోవడంతో చిన్నారులకు ముందు జాగ్రత్త, చికిత్సా పద్ధతులు గుర్తించడం సాధ్యం కావడం లేదని తెలిపారు.

చదవండి: తప్పు చేయొద్దు.. సుదీర్ఘ కాలం మనతోనే కరోనా

చదవండి: కరోనాను మొదట కనిపెట్టింది ఆమేనట!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని