WHOకు మరోసారి చైనా బాసట

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో)కు మరోసారి ఆర్థిక సాయం చేస్తున్నామని చైనా ప్రకటించింది. తమ కోటాకు అదనంగా 30 మిలియన్‌ డాలర్లను అందజేస్తామని గురువారం వెల్లడించింది. కొవిడ్‌-19 సమాచారాన్ని సరైన సమయంలో సమగ్రంగా ఇవ్వలేదని విమర్శించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆరోగ్య...

Published : 23 Apr 2020 14:22 IST

బీజింగ్‌: ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో)కు మరోసారి ఆర్థిక సాయం చేస్తున్నామని చైనా ప్రకటించింది. తమ కోటాకు అదనంగా 30 మిలియన్‌ డాలర్లను అందజేస్తామని గురువారం వెల్లడించింది. కొవిడ్‌-19 సమాచారాన్ని సరైన సమయంలో సమగ్రంగా ఇవ్వలేదని విమర్శించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆరోగ్య సంస్థకు నిధులు నిలిపివేసిన సంగతి తెలిసిందే.

డబ్ల్యూహెచ్‌వోకు అంతకు ముందు అందించిన 20 మిలియన్‌ డాలర్లకు అదనంగా ఈ సహాయం చేస్తున్నామని చైనా విదేశాంగ శాఖ అధికారప్రతినిధి జెంగ్‌ షువాంగ్‌ అన్నారు. ట్రంప్‌ నిధులు నిలిపివేయడంతో సాయం చేసేందుకు తాము ముందుకొస్తామని చైనా ఏప్రిల్‌ 15న ప్రకటించడం గమనార్హం.

‘ఆరోగ్య సంస్థకు నిధులు నిలిపేస్తున్నామన్న అమెరికా ప్రకటనను చైనా తీవ్రంగా పరిగణిస్తోంది’ అని విదేశాంగ శాఖ మరో ప్రతినిధి జావో లిజియాన్‌ అన్నారు. మహమ్మారి ప్రబలుతున్న సమయంలో ప్రజారోగ్యం కోసం పనిచేస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థకు తాము ఎప్పటికీ అండగా ఉంటామన్నారు.

సంస్థకు నిధులు అందించడంలో అమెరికా పాత్రను చైనా భర్తీ చేయనుందా అని ప్రశ్నించగా ‘డబ్ల్యూహెచ్‌కు చైనా 20 మిలియన్‌ డాలర్ల నిధులు అందించింది. ఎక్కువ నిధులు అందించడంపై మేం అధ్యయనం చేస్తాం’ అని జావో అన్నారు. వుహాన్‌లో పుట్టిన కరోనా వైరస్‌ విషయంలో చైనా, డబ్ల్యూహెచ్‌వో పాదర్శకంగా లేవని అమెరికా సహా అనేక దేశాలు విమర్శిస్తున్న సంగతి తెలిసిందే.

చదవండి: ఏపీలో 893కు చేరిన కరోనా వైరస్‌ కేసులు

చదవండి: కరోనా వైరస్‌ను మొదట కనిపిపెట్టింది ఆమేనట!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని