లాక్‌డౌన్ నుంచి వీటికి మినహాయింపు

లాక్‌డౌన్‌ విధించి దాదాపు నెల రోజులు పూర్తి కావస్తున్న నేపథ్యంలో కేంద్రం మరికొన్నింటికి మినహాయింపు ఇచ్చింది. నాన్‌ హాట్‌స్పాట్‌ ప్రాంతాల్లో ఇప్పటికే కొన్నింటికి మినహాయింపు ఇవ్వగా....

Updated : 23 Apr 2020 19:41 IST

దిల్లీ: లాక్‌డౌన్‌ విధించి దాదాపు నెల రోజులు పూర్తి కావస్తున్న నేపథ్యంలో కేంద్రం మరికొన్నింటికి మినహాయింపు ఇచ్చింది. నాన్‌ హాట్‌స్పాట్‌ ప్రాంతాల్లో ఇప్పటికే కొన్నింటికి మినహాయింపు ఇవ్వగా.. ఆ జాబితాలోకి మరికొన్నింటిని చేర్చింది. అర్బన్‌ ప్రాంతాల్లో ఎలక్ట్రిక్‌ దుకాణాలు, స్టేషనరీ షాపులకు మినహాయింపు ఇస్తున్నట్లు కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి సలిల శ్రీవాస్తవ తెలిపారు. మిల్క్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు, మొబైల్‌ రీఛార్జి దుకాణాలు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు పనిచేస్తాయని తెలిపారు. రహదారి నిర్మాణ పనులు, సిమెంట్‌ యూనిట్లకు లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. హాట్‌స్పాట్‌ కేంద్రాలకు ఇవి వర్తించబోవన్నారు. ఈ మేరకు వివిధ శాఖల సంయుక్త మీడియా సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు.


388 మంది కోలుకున్నారు

గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 1409 కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్యారోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ వివరించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 21,393కి చేరిందని చెప్పారు. గడిచిన 28 రోజులుగా దేశవ్యాప్తంగా 12 జిల్లాల్లో కొత్తగా ఒక్క పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాలేదని, గడిచిన 14 రోజులుగా 78 జిల్లాల్లో పాజిటివ్‌ కేసు రాలేదని చెప్పారు. ఇప్పటి వరకు 4,257 మంది కోలుకోగా.. ఒక్క రోజులోనే 388 మంది కోలుకున్నారని తెలిపారు. మొత్తం కేసుల్లో ఇది 19.89 శాతమని లవ్‌ అగర్వాల్‌ వివరించారు. 

వ్యాప్తిని నియంత్రించగలిగాం
లాక్‌డౌన్‌ సమయంలో వైరస్‌ వ్యాప్తిని నియంత్రించగలిగామని ఎంపవర్డ్‌ గ్రూప్‌-2 ఛైర్మన్‌ సీకే మిశ్రా తెలిపారు. ఇదే సమయంలో కేసుల రెట్టింపు అయ్యే సమయం పెరిగిందని చెప్పారు. మార్చి 23 నాటికి దేశంలో 14,915 మందికి మాత్రమే కొవిడ్‌-19 పరీక్షలు చేయగా.. ఏప్రిల్‌ 22 నాటికి ఆ సంఖ్య 5 లక్షలు దాటిందన్నారు. అంటే 30 రోజుల్లో 33 రెట్లు అధికంగా పరీక్షలు చేశామని చెప్పారు. కేసుల వేగంలో సరళ పెరుగుదల ఉందే తప్ప ఘాతాంక పెరుగుదల లేదని పేర్కొన్నారు. ఇది సరిపోదని, పరీక్షల సంఖ్య మరింత పెంచాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

ఇవీ చదవండి..

తరంగాలతో వైరస్‌ వ్యాప్తి చెందదు: యూఎన్‌

తప్పు చేయొద్దు..సుదీర్ఘకాలం మనతోనే కరోనా!

కరోనా వైరస్‌ను మొదట కనిపెట్టింది ఆమేనట!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని