Published : 24 Apr 2020 00:06 IST

బ్రిటన్‌ ప్రధానిని ఒక పేషంట్‌గానే చూశాం

లండన్‌: కరోనా సోకి తీవ్ర అస్వస్థతకు గురైన బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ ఆరోగ్యం మెరుగుపడిన విషయం తెలిసిందే. తనకు ఐసీయూలో సేవలందించిన నర్సులు జెన్నీ మెక్‌జీ, మేల్‌ నర్స్‌ లూయిస్‌ పిటారాలకు ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ప్రముఖులు సైతం వారిపై ప్రశంసల వర్షం కురిపించారు.  ఈ నేపథ్యంలో నర్స్‌ జెన్నీ మెక్‌జీ ఓ టెలివిజన్‌ ఛానల్‌తో మాట్లాడారు.

ప్రధానిని ఐసీయూకు తీసుకువచ్చిన వెంటనే వైద్యం ప్రారంభించినట్టు జెన్నీ తెలిపారు. ఐసీయూలోకి ఎవరు వచ్చినా ఒకే విధంగా వైద్యం అందిస్తామన్నారు. ప్రధానిగా కాక ఆయనను ఒక పేషంట్‌గా చూసి సేవలందించినట్టు ఆమె వెల్లడించారు. నర్స్‌గా తన వృత్తి ధర్మం మాత్రమే నిర్వహించినట్టు జెన్నీ తెలిపారు. న్యూజిలాండ్‌కు చెందిన జెన్నీ గత పదిసంవత్సరాలుగా ఇంగ్లాండ్‌లో వైద్యసేవలందిస్తోంది. బోరిస్‌ జాన్సన్‌ ప్రశంసలతో బాటు ఆమె సొంత దేశం న్యూజిలాండ్‌ ప్రధాని జసిందా ఆర్‌డెర్న్‌ కూడా జెన్నీని ప్రశంసించారు.

ఇవీ చదవండి..

పాకిస్థాన్‌ నుంచి భారత్‌కు కరోనా రోగులు?

లాక్‌డౌన్ నుంచి వీటికి మినహాయింపు

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని