
బోర్డర్లో కాల్పులు.. బదులిచ్చిన సైన్యం
పాకిస్థాన్ కవ్వింపు చర్యలు
రాజౌరి(జమ్ముకశ్మీర్): కాల్పుల విరమణ నిబంధనలను పాకిస్థాన్ మరోసారి ఉల్లంఘించింది. జమ్ముకశ్మీర్‌లోని నౌషేరా నియంత్రణ రేఖ వద్ద శుక్రవారం ఉదయం 11.30 గంటలకు కాల్పులకు పాల్పడింది. కాగా భారత సైన్యం వారికి దీటుగా సమాధానమిచ్చింది. పాక్ కవ్వింపు చర్యలను తిప్పి కొట్టినట్లు భారత ఆర్మీ అధికారులు వెల్లడించారు. కాగా దాయాది దేశం ఇలాంటి చర్యలకు పాల్పడటం వారంరోజుల్లో ఇది మూడోసారి. ఏప్రిల్ 21న కిర్ని సెక్టార్‌లోని ఎల్ఓసీ మీదుగా చిన్న తుపాకులతో కాల్పులు జరుపుతూ, మోర్టార్లను విసిరింది. ఏప్రిల్ 18న సైతం దేగ్వార్ సెక్టార్లో నియంత్రణ రేఖ వద్ద కాల్పులు జరిపింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.