అమృత్‌సర్‌ ఆసుపత్రిలో రోబో సేవలు

పంజాబ్‌ రాష్ట్రం అమృత్‌సర్‌ పట్టణంలోని ఓ ఆసుపత్రిలో కరోనా బాధితులకు సేవలందిస్తోంది ఓ రోబో. శనివారం నుంచి రోబో సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు ఆసుపత్రి వైద్యాధికారులు. ‘కేర్‌బోట్‌’గా..

Published : 26 Apr 2020 00:50 IST

అమృత్‌సర్‌: పంజాబ్‌ రాష్ట్రం అమృత్‌సర్‌ పట్టణంలోని ఓ ఆసుపత్రిలో కరోనా బాధితులకు సేవలందిస్తోంది ఓ రోబో. శనివారం నుంచి రోబో సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు ఆసుపత్రి వైద్యాధికారులు. ‘కేర్‌బోట్‌’గా నామకరణం చేసిన ఈ పరికరం రోగులకు మందులు, మంచినీరు తదితర వస్తువులను అందిస్తోంది. మానవ సంక్రమణను నియంత్రించి వైద్యులు, వైద్య బృందానికి రక్షణ కల్పించేందుకు ఈ పరికరాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు అమృత్‌సర్ డిప్యూటీ కమిషనర్ శివ్‌దులార్ సింగ్ ధిల్లాన్ వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. ‘కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకే ఈ చర్యలు తీసుకున్నాం. మానవ సంక్రమణను తగ్గించి రోగులకు అవసరమైన మందులు, మంచినీటిని రోబో ద్వారా రోగి పడక వద్దకే పంపిస్తున్నాం. ఓ అధికారి పర్యవేక్షణలో ఈ పరికరం పనిచేస్తుంది’ అని ధిల్లాన్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని