కరోనా కట్టడికి అదొక్కటే మార్గం: మన్మోహన్‌

కరోనా మహమ్మారి విసురుతున్న సవాళ్లను అధిగమించాలంటే నిర్ధారణ పరీక్షల్ని మరింత వేగంగా, ఎక్కువగా చేయడం ఒక్కటే మార్గమని మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ అన్నారు.......

Updated : 26 Apr 2020 14:43 IST

దిల్లీ: కరోనా మహమ్మారి విసురుతున్న సవాళ్లను అధిగమించాలంటే నిర్ధారణ పరీక్షల్ని మరింత వేగంగా, ఎక్కువగా చేయడం ఒక్కటే మార్గమని మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ అన్నారు. ఇప్పటికే దేశంలో పలు ప్రాంతాల్లో టెస్టింగ్‌ కిట్ల కొరత ఉందని ఆయన అన్నారు. ఇలాంటి సమస్యల్ని పరిష్కరిస్తే ఎక్కువ సంఖ్యలో పరీక్షలు చేయడం సాధ్యమవుతుందని తెలిపారు. ఈ మేరకు పలువురు నాయకులు మాట్లాడిన ఓ వీడియోను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. కరోనా కట్టడి, లాక్‌డౌన్‌ ఇక్కట్లకు సంబంధించిన అంశాల్ని వీరంతా ప్రస్తావించారు. 

వలస కూలీలకు సంబంధించిన కష్టాల్ని కాంగ్రెస్‌ నాయకులు ఈ సందర్భంగా గుర్తుచేశారు. వీరికి ఆర్థిక సాయం అందించి.. అన్ని రకాల రక్షణ ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక బాధ్యత వహించాలని పార్టీ నాయకుడు రాహుల్‌ గాంధీ అన్నారు. కూలీల్ని సొంత రాష్ట్రాలకు తరలించడంపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చర్చించుకొని నిర్ణయించాలని సూచించారు. మరో సీనియర్‌ నాయకుడు పి.చిదంబరం మాట్లాడుతూ.. కూలీల సొంత రాష్ట్రాలే వారిని తరలించే బాధ్యతను తీసుకోవాలని తెలిపారు. ఆయా రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వారికి ఆర్థిక సాయంతో పాటు ఆహార ధాన్యాలు ఇవ్వాలని పార్టీ ప్రధాన కార్యదర్శి కే.వేణుగోపాల్‌ డిమాండ్‌ చేశారు. ఇక ప్రభుత్వం ప్రకటించిన తొలి ఉద్దీపన పథకం వల్ల ప్రజలకు పెద్దగా లబ్ధి చేకూరలేదని.. మరో విడత సాయాన్ని ప్రకటించాలని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సూర్జేవాలా కోరారు. 

ఇవీ చదవండి..

ఇల్లు చేరడానికి ఉ‘ల్లి’పాయం

పొరుగునా పొగే


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని