కాలుష్య హాట్‌స్పాట్‌లు గ్రీన్‌జోన్లయ్యాయి...!

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలులో ఉండటంతో పనులు లేక, తినడానికి తిండి దొరక్క పలువురు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అయితే కొన్ని ముఖ్య నగరాలకు మాత్రం లాక్‌డౌన్ మేలు చేసిందనే చెప్పాలి. ఎలా అంటే, లాక్‌డౌన్‌తో వాహనాలు రోడ్లపైకి.....

Published : 26 Apr 2020 23:23 IST

దిల్లీ: దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలులో ఉండటంతో పనులు లేక, తినడానికి తిండి దొరక్క పలువురు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అయితే కొన్ని ముఖ్య నగరాలకు మాత్రం లాక్‌డౌన్ మేలు చేసిందనే చెప్పాలి. లాక్‌డౌన్‌తో వాహనాలు రోడ్లపైకి రావడంలేదు, అలానే పలు పరిశ్రమలు మూతపడ్డాయి. దీంతో దిల్లీ, ముంబయి నగరాల్లో గాలి నాణ్యత మెరుగుపడిందట. ఈ మేరకు రెండు నగరాల్లో కాలుష్య ప్రజ్వలన కేంద్రాలుగా (హాట్‌స్పాట్) ఉన్న పది ప్రదేశాల్లో కాలుష్యం తగ్గి గ్రీన్‌ జోన్లుగా మారిపోయాయట. లాక్‌డౌన్‌కు ముందు దిల్లీలో ఎనిమిది ప్రదేశాలు కాలుష్య ప్రజ్వలన కేంద్రాలుగా ఉండగా, ప్రస్తుతం అవి గ్రీన్‌ జోన్లుగా మారిపోయాయని ఎస్‌ఏఎఫ్ఏఆర్‌ (సిస్టం ఆఫ్ ఎయిర్‌ క్వాలిటీ వెదర్‌ ఫోర్‌కాస్టింగ్ అండ్ రీసెర్చ్‌) డైరెక్టర్‌ గుఫ్రాన్‌ బేగ్ తెలిపారు. అంతే కాకుండా లాక్‌డౌన్‌ సమయంలో నదుల స్వచ్ఛత కూడా మరింత మెరుగుపడిందని బేగ్ అన్నారు.

దిల్లీలోని వినోభాపురి, ఆదర్ష్‌ నగర్‌, వసుంధర, సాహిబాబాద్‌, ఆశ్రమ్‌ రోడ్, పంజాబీ బాగ్, ఓక్లా, బాదాపూర్‌ ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ ముందు గాలి నాణ్యతతో పోల్చి చూస్తే ప్రస్తుత పరిస్థితి మెరుగుపడిందని అన్నారు. అలానే ముంబయిలోని వర్లి, బోరివాలి, భందుప్ ప్రాంతాల్లో గాలి నాణ్యత పెరిగిందని తెలిపారు. పరిశ్రమల కార్యకలాపాలు, వాహనాల రాకపోకల రద్దీ ఎక్కువగా ఉండటంతో రెండు నగరాల్లోని ఆయా ప్రాంతాల్లో కాలుష్య తీవ్రత గతంలో ఎక్కువగా ఉండేది. ప్రస్తుతం లాక్‌డౌన్‌తో అక్కడ కాలుష్యం తగ్గి గాలి నాణ్యత సంతృప్తికర స్థాయికి చేరుకుందని ఎస్‌ఏఎఫ్ఏఆర్ తెలిపింది. మొత్తంగా దిల్లీ, ముంబయి, పుణే, అహ్మదాబాద్‌ నగరాల్లో ఈ పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు.  

ఇవీ చదవండి:

క్వారంటైన్‌కు 14 మంది బీఎస్‌ఎఫ్‌ జవాన్లు

80శాతం కేసులు లక్షణాలు లేకుండానే!: ఉద్ధవ్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని