44 రోజుల తర్వాత.. స్పెయిన్‌లో కేరింతలు

స్పెయిన్‌లో కరోనా ఉద్ధృతి తగ్గుతోంది. గత 24 గంటల్లో మహమ్మారి బారినపడి 288 మంది మరణించారు. దీంతో ఆ దేశంలో కరోనా మృతుల సంఖ్య 23,190కి పెరిగింది. అయితే మార్చి 20 నుంచి రోజువారీ మరణాల్లో ఇదే అత్యల్పం. అంతేకాక...

Published : 26 Apr 2020 19:45 IST

మాడ్రిడ్‌: స్పెయిన్‌లో కరోనా ఉద్ధృతి తగ్గుతోంది. గత 24 గంటల్లో మహమ్మారి బారినపడి 288 మంది మరణించారు. దీంతో ఆ దేశంలో కరోనా మృతుల సంఖ్య 23,190కి పెరిగింది. అయితే మార్చి 20 నుంచి రోజువారీ మరణాల్లో ఇదే అత్యల్పం. అంతేకాక కొత్త కరోనా బాధితుల సంఖ్య కూడా క్రమంగా తగ్గుతోందని ప్రభుత్వం తెలిపింది. రోజువారీగా కరోనా బారిన పడే వారి సంఖ్య నెల క్రితం 20 శాతం ఉండగా 0.8 శాతానికి పడిపోయింది. ప్రస్తుతం ఆ దేశంలో బాధితుల సంఖ్య 2,07,634.

అయితే టెస్టింగ్‌ కిట్స్‌ పరిమితంగా ఉన్నాయని, కరోనా బాధితుల సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం లేకపోలేదని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం మరణాల సంఖ్య తగ్గడం, మహమ్మారి తీవ్రత పెరగకుండా చర్యలు చేపట్టడమే తమ కర్తవ్యమని వైద్యాధికారి ఒకరు తెలిపారు. ఇప్పటికే పాఠాశాలలను తెరవాలని నిశ్చయించుకున్న ప్రభుత్వం లాక్‌డౌన్ సడలింపులపై మంగళవారం కీలక నిర్ణయాలు తీసుకోనుంది.

చిన్నారుల కేరింతలు

44 రోజుల తర్వాత స్పెయిన్‌ కాలనీల్లో చిన్నారులు కేరింతలు కొడుతున్నారు. లాక్‌డౌన్‌ సడలింపులు చేస్తూ ఆదివారం నుంచి 14 ఏళ్ల వయసులోపు చిన్నారులకు బయట తిరగడానికి ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ఇంటి నుంచి కిలోమీటరు పరిధిలో సంరక్షకుని సమక్షంలో గంటపాటు నడకకు అనుమతిచ్చింది. అయితే ఇతరులతో మీటరు భౌతిక దూరం పాటించాలని సూచించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని