కరోనా మాయ: కూరలమ్ముతున్న మెజీషియన్ 

అతని మ్యాజిక్‌కు ఫిదా అవ్వని ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తికాదు, తన మాయాజాలంతో ఎంతో మంది మన్ననలు పొందాడు. అయితే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదంటారు, విధికి అతని పట్ల కన్ను కుట్టింది. మ్యాజిక్‌ చేసిన ఆ చేతులతోనే కూరగాయల బండిని.......

Updated : 26 Apr 2020 20:13 IST

జైపూర్‌: అతని మ్యాజిక్‌కు ఫిదా అవ్వని వీక్షకులు ఉండరంటే అతిశయోక్తికాదు, తన మాయాజాలంతో ఎంతో మంది మన్ననలు పొందాడు. అయితే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదంటారు. మ్యాజిక్‌ చేసిన ఆ చేతులతోనే కూరగాయల బండిని తోసే పరిస్థితి కల్పించింది. కరోనా నియంత్రణ కోసం కేంద్రం లాక్‌డౌన్‌ విధించడంతో చాలా మంది ఉపాధి కోల్పోయారు. వారిలో రాజస్థాన్‌లోని ధోల్‌పూర్‌ జిల్లాకు చెందిన రాజు మహోర్ కూడా ఉన్నాడు‌. 15 సంవత్సరాలుగా మెజీషియన్‌ కళనే ఉపాధిగా చేసుకొని జీవనం సాగిస్తున్నాడు. కరోనా కట్టడికి కేంద్రం విధించిన లాక్‌డౌన్‌తో కార్యక్రమాలు లేక బతుకుతెరువు కోసం కూరగాయలు అమ్ముకుంటున్నాడు. ఒక్క రాజు మహోర్‌ మాత్రమే కాదు దేశవ్యాప్తంగా ఎంతో మంది కళనే నమ్ముకొని జీవిస్తున్న వారిని పరిస్థితిని లాక్‌డౌన్‌ ఒక్కసారిగా మార్చేసిందనే చెప్పాలి. 

‘‘కరోనా సంక్షోభం నా వ్యాపారాన్ని పూర్తిగా మూసేసింది. నాతో పాటు పనిచేసిన డజను మంది లాక్‌డౌన్‌తో ఇళ్లకే పరిమితమయ్యారు. ఇంటి అద్దె కట్టడానికి, కుటుంబాన్ని పోషించటం కోసం నాకు కూరగాయలు అమ్మడం మినహా వేరే దారి కనిపించలేదు’’ అని రాజు అన్నాడు. తన జీవితంలో ఇటువంటి పరిస్థితులను ఎప్పుడూ చూడలేదని, ఉపాధి కోల్పోయిన వారిని ప్రభుత్వం ఆదుకోవాలని అభ్యర్థించాడు. ‘‘గత 15 ఏళ్లలో ఉత్తర ప్రదేశ్‌, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో ఎన్నో షోలు చేశాను. ఒక్కోసారి రోజుకు 8 నుంచి 10 దాకా షోలు చేసేవాడిని. చివరగా భిండ్, మొరేనా ప్రాంతాల్లో ప్రదర్శన చేశాను. లాక్‌డౌన్‌తో నా వస్తువులన్ని భిండ్‌లో ఉండిపోయాయి’’ అని ఆవేదన వ్యక్తం చేశాడు. త్వరలోనే పరిస్థితులు చక్కబడి మంచి రోజులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపాడు. 

ఇవీ చదవండి:

వాట్సాప్‌లో జియోమార్ట్‌ సేవలు షురూ

మే 3 తర్వాత స్వదేశానికి భారతీయులు?

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని