
దిల్లీలో తెలుగు ప్రజలకు ‘సేవ’
దిల్లీ: లాక్డౌన్ కారణంగా దేశ రాజధాని దిల్లీలో ఇబ్బందులు పడుతున్న తెలుగు కుటుంబాలకు సమైక్య తెలుగు ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ (సేవ) తరఫున నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నట్లు సంస్థ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.మురళీకృష్ణ, జీవీఆర్ మురళి పేర్కన్నారు. సుల్తాన్‌పురి, ఆనంద్ పర్బత్, అన్నానగర్, పదమ్నగర్, శాస్త్రనగర్ తదితర ప్రాంతాల్లో నెల రోజులుగా సేవ సంస్థ ద్వారా వందల మంది తెలుగు ప్రజలకు బియ్యం, పప్పు, పంటనూనె, కూరగాయలతోపాటు మాస్కులు కూడా అందిజేసినట్లు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.