ఇథియోపియన్‌ ఎయిర్‌ కార్గో సేవలు ప్రారంభం

శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి ఆఫ్రికన్ మార్కెట్లను అనుసంధానం చేస్తూ ఇథియోపియన్ ఎయిర్‌ కార్గో సేవలు ప్రారంభమయ్యాయి. ఇథియోపియా రాజధాని అడిస్ అబాబా నుంచి తొలి ఇథియోపియన్ ఎయిర్ లైన్స్ విమానం..

Published : 26 Apr 2020 23:55 IST

హైదరాబాద్‌: శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి ఆఫ్రికన్ మార్కెట్లను అనుసంధానం చేస్తూ ఇథియోపియన్ ఎయిర్‌ కార్గో సేవలు ప్రారంభమయ్యాయి. ఇథియోపియా రాజధాని అడిస్ అబాబా నుంచి తొలి ఇథియోపియన్ ఎయిర్ లైన్స్ విమానం ఆదివారం శంషాబాద్‌కు వచ్చింది. దీంతో ఆఫ్రికా మార్కెట్లతో హైదరాబాద్‌కు సంబంధాలు ఏర్పడినట్లయింది. 50 మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం కలిగిన బోయింగ్‌ 777-300 విమానం వారానికి ఒకసారి అడిస్‌బాబా నుంచి హైదరాబాద్‌కు రానుంది. తాజాగా ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్ చేరికతో శంషాబాద్‌ నుంచి నడుస్తున్న స్పెషల్ కార్గో విమానాల సంఖ్య 12కు చేరింది.  కాతే, టర్కిష్, లుఫ్తాన్సా, స్పైస్ ఎక్స్ ప్రెస్, బ్లూ డార్ట్‌ తదితర ఎయిర్‌ కార్గో సంస్థలు శంషాబాద్‌ నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని