నిందితుడికి కరోనా: క్వారంటైన్‌కి పోలీసులు..

ఓ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తికి కరోనా వైరస్‌ నిర్ధారణ అయ్యింది. దీంతో పోలీసులు, కోర్టు సిబ్బంది కలిపి దాదాపు 22మంది క్వారంటైన్‌లో ఉండాల్సిన ఘటన ముంబయిలో చోటుచేసుకుంది. ముంబయి గోరేగావ్‌కు చెందిన యువకుడు ఓ సిగరెట్‌ షాపులో దొంగతనానికి యత్నించాడు.

Updated : 27 Apr 2020 16:20 IST

ముంబయి: ఓ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తికి కరోనా వైరస్‌ నిర్ధారణ అయ్యింది. దీంతో పోలీసులు, కోర్టు సిబ్బంది కలిపి దాదాపు 22మంది క్వారంటైన్‌లో ఉండాల్సిన ఘటన ముంబయిలో చోటుచేసుకుంది. ముంబయి గోరేగావ్‌కు చెందిన యువకుడు ఓ సిగరెట్‌ షాపులో దొంగతనానికి యత్నించాడు. దీన్ని పసిగట్టిన పెట్రోలింగ్‌ పోలీసులు అతన్ని అరెస్ట్‌ చేశారు. అతనిపై అప్పటికే పలు కేసులు ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. మరుసటిరోజు మెజిస్ట్రేట్‌ ముందు హాజరుపరిచి..విచారణ కోసం నిందితున్ని కస్టడీకి తీసుకున్నారు. విచారణ అనంతరం అతన్ని మొదట థానే సెంట్రల్‌ జైలుకు తరలించారు. కానీ ఆ జైళ్లో ఖైదీల సంఖ్య ఎక్కువగా ఉండడంతో రాయ్‌గడ్‌లోని తలోజా సెంట్రల్‌ జైలుకు తరలించారు. ఆ సమయంలో నిందితునికి కొవిడ్‌-19 నిర్ధారణ పరీక్షలు చేయకుండా జైళ్లోకి అనుమతించమని అధికారులు తేల్చిచెప్పారు. దీంతో అతనికి నగరంలోని జేజే ఆసుపత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించారు. పరీక్షల్లో అతనికి కొవిడ్‌ నిర్ధారణ కావడంతో అధికారులు షాక్‌కు గురయ్యారు. విచారణలో భాగంగా అతనితో తిరిగిన పోలీసులను క్వారంటైన్‌కి తరలించారు. అంతేకాకుండా న్యాయమూర్తితో పాటు కోర్టు సిబ్బందిని కూడా 14రోజులపాటు హోం క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు.

ఇప్పటికే మహారాష్ట్రలో కరోనా బారినపడి ఇద్దరు పోలీసులు మరణించారు. అంతేకాకుండా పదుల సంఖ్యలో పోలీసులు కొవిడ్‌ సోకి ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఈ సమయంలో ఇలాంటి ఘటనలు పోలీసులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇదిలాఉంటే, మహారాష్ట్రలో కరోనా తీవ్రత అధికంగా ఉంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 8వేలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 342మంది మృత్యువాతపడ్డారు.

ఇవీ చదవండి..

భారత్‌లో 872కు చేరిన కరోనా మరణాలు!

షేక్‌హ్యాండ్స్‌--నమస్కారం--సెల్యూట్‌ ఎలా వచ్చాయ్‌?
 

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు