80 జిల్లాల్లో కొత్త కేసుల్లేవ్‌: కేంద్రం

గడచిన ఏడురోజుల్లో దేశవ్యాప్తంగా 80 జిల్లాల్లో కొత్తగా కరోనా కేసులు నమోదుకాలేదని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్థన్‌ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ బయోటెక్నాలజీ విభాగంలోని పలు స్వయంప్రతిపత్తి సంస్థలు, ప్రభుత్వ రంగ యూనిట్ల అధికారులతో నేడు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కేంద్ర మంత్రి మాట్లాడారు.

Published : 28 Apr 2020 15:56 IST

దిల్లీ: గడచిన ఏడురోజుల్లో దేశవ్యాప్తంగా 80 జిల్లాల్లో కొత్తగా కరోనా కేసులు నమోదుకాలేదని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్థన్‌ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ బయోటెక్నాలజీ విభాగంలోని పలు స్వయంప్రతిపత్తి సంస్థలు, ప్రభుత్వ రంగ యూనిట్ల(పీఎస్‌యూ) అధికారులతో నేడు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కేంద్ర మంత్రి మాట్లాడారు. ఈ సందర్భంలో 80జిల్లాల్లో గతవారం రోజులుగా కొత్త కేసులు నమోదుకాలేదని స్పష్టం చేశారు. అంతేకాకుండా వీటిలో 47జిల్లాల్లో గత 14రోజుల నుంచి, 39 జిల్లాల్లో గత 21రోజుల నుంచి కొత్త కరోనా కేసులు నిర్ధారణ కాలేదని మంత్రి హర్షవర్థన్‌ ప్రకటించారు. ఇక 17 జిల్లాల్లో గత 28 రోజుల నుంచి కొవిడ్‌ కేసులు నమోదు కాలేదని వివరించారు. ఇప్పటివరకు అత్యధిక ప్రభావితం గల 129జిల్లాలను హాట్‌స్పాట్‌లుగా ప్రకటించగా, మరో 300 జిల్లాలు హాట్‌స్పాట్‌లు కాని జిల్లాలుగా ఉన్నాయని వెల్లడించారు. ఇదిలాఉంటే, ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 29,435 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 934మంది మరణించారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

ఇవీ చదవండి..

నిండుగర్భిణి...ఆరు ఆసుపత్రులు..చివరకు మృతి..!

దేశంలో 30వేలకు చేరువగా కరోనా కేసులు..

కరోనాతో ఆటలొద్దు: అష్టాచమ్మా, క్యారమ్స్‌కు దూరం!

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు